Begin typing your search above and press return to search.

అమ్మాయిలు లవర్స్ ను వెతుక్కోవాలంటూ స‌ర్క్యుల‌ర్‌.. వర్సిటీ క్లారిటీ!

By:  Tupaki Desk   |   27 Jan 2021 9:34 PM IST
అమ్మాయిలు లవర్స్ ను వెతుక్కోవాలంటూ స‌ర్క్యుల‌ర్‌.. వర్సిటీ క్లారిటీ!
X
ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఓ స‌ర్క్యుల‌ర్ తెగ చెక్క‌ర్లు కొడుతోంది. దాన్ని చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. అది ఎవ‌రో విడుద‌ల చేసింది కాదు.. సాక్షాత్తూ ఓ విద్యా సంస్థ జారీచేసిందంటూ ఫుల్లుగా స‌ర్క్యులేట్ అవుతోంది.

దీని ప్ర‌కారం.. ఆ విద్యా సంస్థ‌లో చ‌దివే విద్యార్థులంతా.. రాబోయే ప్రేమికుల దినోత్స‌వం లోపు బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కోవాల‌ని అందులో ఉంది. ఒక‌వేళ ఎవ‌రైనా ఫిబ్ర‌వ‌రి 14 లోపు బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉన్న‌ట్ల‌యితే.. క్యాంప‌స్ లోనికి రానివ్వ‌బోమంటూ మేనేజ్ మెంట్ ప్ర‌క‌టించిన‌ట్టుగా ఉంది.

గ‌డిచిన మూడ్నాలుగు రోజులుగా ఈ విష‌యం సామాజిక మాధ్య‌మాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసిన వారంతా.. ఇదెక్క‌డి చోద్యం అని ముక్కున వేలేసుకున్నారు. ఒక విద్యా సంస్థే ఇలా స‌ర్క్యుల‌ర్ ఇవ్వ‌డ‌మేంట‌ని అనుకున్నారు. అయితే.. దీనిపై త‌మిళ‌నాడులోని ఎస్ఆర్ ఎం ఇనిస్టిట్యూట్ స్పందించింది. అది తాము జారీచేసిన స‌ర్క్యుల‌ర్ కాద‌ని స్ప‌ష్టం చేసింది. ఎవ‌రో కావాల‌ని ఈ ఫేక్ స‌ర్క్యుల‌ర్ ను ప్ర‌చారంలో పెట్టార‌ని, దాన్ని ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని కోరింది.