Begin typing your search above and press return to search.

రేవ్ పార్టీ: పోలీసుల అదుపులో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్, సినీ ప్రముఖులు

By:  Tupaki Desk   |   3 April 2022 7:26 AM GMT
రేవ్ పార్టీ: పోలీసుల అదుపులో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్, సినీ ప్రముఖులు
X
హైదరాబాద్ లో మరో భారీ రేవ్ పార్టీ బయటపడింది. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. దాదాపు 157 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఉన్నట్టు చెబుతున్నారు. ఫండింగ్ మింక్ అనే పబ్ పై అధికారులు దాడులు చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు.

ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా దాదాపు 150మందికి పైగా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ లో డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకతో పబ్ లోని యువతీ యువకులు డ్రగ్స్ ను కిటీకీలోంచి కింద పడేశారు. బయటపడేసిన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు ఉన్నారు. పట్టుబడిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, మాజీ ఎంపీ కుమారుడితో సహా మిగతా వారికి నోటీసులు అందించారు.

మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా రేవ్ పార్టీలో పోలీసులకు చిక్కారని వార్తలు వస్తున్నాయి. స్టార్ డాటర్ ఇందులో చిక్కినట్టు తెలిసింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్తె కూడా పట్టుబడినట్టు చెబుతున్నారు. వీరందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించిన అధికారులు వారికి కౌన్సిలింగ్ తాజాగా డ్రగ్స్ మందిని ఇంటికి పంపించినట్టు సమాచారం. నోటీసులు ఇచ్చి ఇంటికి పంపినట్లు సమాచారం. మరోసారి స్టేషన్ కు విచారణ నిమిత్తం పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇక ఈ పబ్ నిర్వాహకులు అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది

ఈ పబ్ మాజీ ఎంపీ కుమార్తెది కావడంతో పోలీసులు చూసి చూడనట్టు వదిలేసినట్టు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ శివచంద్రను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. చార్జ్ మెమో దాఖలు చేశారు. పబ్ యాజమాన్యమే ఈ డ్రగ్స్ సరఫరా చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు నిర్వాహకులను, పార్టీలో పాల్గొన్న వారిని విచారిస్తున్నారు.