Begin typing your search above and press return to search.
ఫ్రెండ్ ఇంట్లో సీఐడీ మహిళా డీఎస్పీ ఆత్మహత్య !
By: Tupaki Desk | 17 Dec 2020 2:21 PM ISTకర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సీఐడీ మహిళా ఆఫీసర్ పీవీ లక్ష్మి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు సీఐడీ విభాగంలో డీఎస్పీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 33 ఏళ్ల పీవీ లక్ష్మి బుధవారం రాత్రి డిన్నర్ కోసం తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. రాత్రి 10:30 గంటల సమయంలో ఆమె ఫ్రెండ్ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2014లో నిర్వహించిన సీఐడీ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించింది. శిక్షణ అనంతరం 2017లో ఉద్యోగంలో చేరింది.
ఈ ఘటన ఒక్కసారిగా కర్ణాటక పోలీస్ శాఖలో ప్రకంపలను పుట్టించింది. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. కుటుంబ కలహాల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక సీఐడీలో డీఎస్పీగా పని చేస్తున్నారు. కొంతకాలంగా ఆమె సెలవుల మీద ఉంటున్నారు. ఆమె తండ్రి బీబీఎంపీలో ఉన్నతస్థానంలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. బుధవారం రాత్రి ఆమె బెంగళూరు నాగరభావిలోని వినాయక లేఔట్ లో గల తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి, అక్కడ నిర్వహించిన ఓ మందుపార్టీలో పాల్గొన్నారని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. ఆ తర్వాత అక్కడే తనకు కేటాయించిన ప్రత్యేక గదిలో లక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఆమె స్నేహితురాలు అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష్మి మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
ఆమెకి 2012లో లక్ష్మి వివాహమైంది. ఆమె భర్త పేరు నవీన్. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తరచూ బెంగళూరుకు వస్తుంటారు. వారిది ప్రేమ వివాహం. వారికి పిల్లలు లేరు. లక్ష్మీకి మద్యం సేవించే అలవాటు ఉందని, ఆ కారణంగా కొంతకాలంగా ఆమె అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. ఇదే విషయం లో కుటుంబంలో గొడవలు కూడా జరిగాయి అని , గత కొన్ని రోజులుగా భర్త కూడా దూరంగా ఉంటున్నాడు అని తెలుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త దూరంగా ఉండటం , పిల్లలు లేకపోవడం తో మద్యానికి మరింత అలవాటు పడ్డారని, దీనితో డిప్రెషన్ గురై.. ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని స్నేహితులు చెబుతున్నారు.