Begin typing your search above and press return to search.
ఏపీ రాజధాని భూములపై సీఐడీ విచారణ.. ఏం తేలుస్తారు?
By: Tupaki Desk | 24 Aug 2022 1:30 AM GMTతీవ్ర వివాదానికి, రాజకీయంగా దుమారానికి వైసీపీ సర్కారు తెరదీసిన ప్రధాన విషయాల్లో ఏపీ రాజధాని అమరావతి కీలకమైంది. ఇక్కడి భూముల విషయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం తీవ్ర అవకతవకలు చేసిందని పేర్కొంటూ.. వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఈ దుమారానికి తెరదీసింది. అంతేకాదు.. దీనిపై సీఐడీని కూడా నియమించింది. అమరావతి ప్రాంతంలో 2014-19 మధ్య కాలంలో జరిగిన అసైన్డ్ భూముల కొనుగోళ్లపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ విచారణ జరుపుతోంది.
అయితే.. తాజాగా సీఐడీ అధికారుల పరిశీలన పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాజధాని భూముల విషయంలో వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వం చెబుతున్న విషయంలోను.. స్థానికంగా ఉన్న వాస్తవం విషయంలోనూ.. పొంతన లేదని తేల్చేసినట్టు సమాచారం. రాజధాని నిర్మాణంలో భాగంగా గత ప్రభు త్వం 34,400.15 ఎకరాలను భూసమీకరణ విధానంలో తీసుకుంది. ఇందులో 3,129 మంది రైతులు ఇచ్చిన 2,689.14 ఎకరాలకు సంబంధించి విచారణ జరుగుతోంది. వీటితో పాటు 4, 5 కేటగిరీల్లోని భూములను అసైన్డ్‌గా పేర్కొంటూ.. ఆయా భూములకు సీఆర్డీఏ అధికారులు కౌలు నిలిపివేశారు.
అయితే.. కేటగిరీ-4లో 290.27 ఎకరాల మేర అసైన్డ్ భూములున్నాయని, కేటగిరీ-6లో చెరువు, వాగు పోరం బోకు భూములు 90.52 ఎకరాలున్నాయని ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఇవి పోగా మిగి లిన 2,308.35 ఎకరాల భూములపై సీఐడీ అధికారులు దృష్టి సారించారు.
విచారణ పూర్తికాగానే వివరాల ను సీఆర్డీఏకు అందించనున్నారు. వీటిల్లో ఎలాంటి అక్రమాలు లేవని నిర్ధారణకు వచ్చిన భూములకు సంబంధించి ఇప్పటిదాకా నిలిపేసిన కౌలును చెల్లించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
పట్టా భూములకు ఇప్పటికే ఓ విడత వార్షిక కౌలు కింద రూ.184 కోట్లు జమచేసిన సీఆర్డీఏ.. మరో 1,304 మంది రైతుల ఖాతాల్లో రూ.7.84 కోట్లు వేసింది. ఇక, 455.04 ఎకరాలకు సంబంధించి వివాదాలు, సివిల్ వ్యాజ్యాలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
వీటిపై తీర్పులను బట్టి కౌలు చెల్లింపుపై నిర్ణయం తీసుకోనుం ది. మొత్తంగా చూస్తే.. వైసీపీ ప్రభుత్వం కానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేగా నీ ఆరోపించినట్టు ఇక్కడ ఏమీ జరగలేదని సీఐడీ అధికారుల పరిశీలనలో తేలినట్టు..రాజధాని వర్గాలు భావిస్తున్నాయి. మరి నివేదికలో ఎలాంటి విషయాలువెలుగు చూస్తాయో చూడాలి.