Begin typing your search above and press return to search.

గన్ పట్టిన చర్చ్ ఫాదర్ ..అసలు కారణం ఇదే !

By:  Tupaki Desk   |   19 May 2020 6:00 AM IST
గన్ పట్టిన చర్చ్ ఫాదర్ ..అసలు కారణం ఇదే !
X
అదేంటి... పరమ సాత్వికులుగా మనుగడ సాగించాల్సిన ఫాదర్లు తుపాకీ పట్టడం ఏమిటి? లోక రక్షకుడు, కరుణామయుడు బిడ్డ అయిన చర్చి ఫాదర్ చేతిలో గన్ కనిపించటం కాస్తంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది కదూ.. అది నిజం తుపాకీ కాదులెండి..అది బొమ్మ తుపాకీ. ఇంతకూ అలా బొమ్మ తుపాకీ పట్టాల్సిన అవసరం. ఆ విశేషమేంటో చూద్దాం..

ఇప్పుడు ప్రపంచమంతా ఒకటే మాత్రం అదే సామజిక దూరం. దీన్ని పాటించకపోతే మహమ్మారి కాటేస్తుంది. కాబట్టి , ప్రతి ఒక్కరు దూరం పాటించక తప్పదు. ఈ వ్యాధికి సరైన వ్యాక్సిన్ వచ్చేవరకు .. సామజిక దూరమే దీనికి సరైన మందు. ఇలాంటి కాలంలో చర్చి ఫాదర్ ఏసు విశ్వాసులపై పవిత్రజలం చిలకరించాలంటే వారి దగ్గరకు వెళ్లాల్సిందే. అలా వెళ్లకుండా దూరం నుంచి పవిత్రజలం విశ్వాసులపై చల్లటానికి తుపాకీ మంత్రాన్ని కనిపెట్టారు ఈ ఫాదర్.

అమెరికాలోని డెట్రాయిట్ లో నీటిని పిచికారీ చేసే తుపాకీతో పవిత్ర జలాన్ని చిలకరిస్తున్న ఫాదర్ టిమ్ పెల్క్ ఫొటోలు నెట్‌ లో వైరల్ అవుతున్నాయి. ఫేస్‌ బుక్, రెడ్డిట్, ట్విట్టర్ మొదలైన అన్ని సామాజిక మాధ్యమాల్లో బోలెడన్ని షేర్లు, లైకులతో ఈ ఫొటో షేర్ అయింది. ట్విట్టర్ లో ఈ పొటో 5.6 లక్షల లైకులు, లక్షకు పైగా రీట్వీట్లు వచ్చాయి. ఓ డాక్టరుతో చర్చించిన తర్వాత ఈ తుపాకీ ఐడియా వచ్చిందని పాదర్ పెల్క్ చెప్పారు.