Begin typing your search above and press return to search.

ఈ హాలీవుడ్ రియల్ ‘ఫ్యాన్’ స్టోరీ విన్నారా?

By:  Tupaki Desk   |   21 April 2016 6:39 AM GMT
ఈ హాలీవుడ్ రియల్ ‘ఫ్యాన్’ స్టోరీ విన్నారా?
X
ఇదో హాలీవుడ్ అభిమాని రియల్ స్టోరీ. ట్రేస్టిన్ బడ్జిన్ అనే వ్యక్తి.. థోర్.. ఎవేంజర్స్ సినిమాల్లో నటించిన స్టార్ హీరో క్రిస్ హేమ్ వర్త్ కు పిచ్చ ఫ్యాన్. ఈ మధ్యన ఈ స్టార్ హీరో ఇటీవల లంచ్ కోసం ఒక హోటల్ కు వెళ్లారు. అక్కడ తన పర్స్ మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. కాసేపటికే అదే హోటల్ కు వచ్చిన ఆ హీరో అభిమాని.. తన హీరో కూర్చున్న సీట్లోనే కూర్చున్నాడు. అక్కడే ఉన్న పర్సును చూశాడు.

దాన్ని తీసుకొని చూస్తే.. అది తానెంతో అభిమానించే స్టార్ హీరో పర్సు అని తెలియటంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. హీరో పర్సును తనతో ఉంచుకోకుండా.. తిరిగి ఇచ్చేందుకు హీరో ఇంటికి వెళ్లాడు. తన అభిమాని నిజాయితీకి మురిసిపోయిన క్రిస్ హేమ్ వర్త్ అతనికి మంచి గిఫ్ట్ ఇచ్చి పంపాడు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కింది.

ఈ సినిమాటిక్ విషయాన్ని తెలుసుకున్న ఇమేజ్ పబ్లిషర్స్ సంస్థ ఒకటి ఈ అభిమాని నిజాయితీకి మెచ్చి అతనికి 10వేల డాలర్లు (కాస్త అటూ ఇటుగా రూ.6.7లక్షలు) బహుమతిగా ఇచ్చింది. అంతేకాదు.. తన అభిమాన హీరో పాల్గొనే షోలో పాల్గొనే అవకాశం ఈ ఫ్యాన్ కి వచ్చింది. దీంతో.. అతనిప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ రియల్ ఫ్యాన్ స్టోరీ ఆసక్తికరంగా ఉంది కదూ..?