Begin typing your search above and press return to search.

అనిల్ కుంబ్లేపై క్రిస్ గేల్ వ్యగ్యాస్త్రాలు.. వైరల్..!

By:  Tupaki Desk   |   29 Dec 2022 12:04 PM GMT
అనిల్ కుంబ్లేపై క్రిస్ గేల్ వ్యగ్యాస్త్రాలు.. వైరల్..!
X
ప్రపంచ క్రికెట్లో విధ్వంసకరమైన బ్యాట్స్ మెన్లలో క్రిస్ గేల్ ఒకడు. ప్రత్యర్థి జట్టు తన ముందు ఎంత లక్ష్యాన్ని ఉంచినా ఏమాత్రం బెరవకుండా దూకుడుగా ఆడుతూ టీం విజయంలో క్రిస్ గేల్ కీలక పాత్ర పోషించాడు. ఎన్నోసార్లు ఒంటిచేత్తో వెస్టిండీస్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఫోర్లు.. సిక్సర్లు బాదుతూ స్టేడియం లోపల.. బయట కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు క్రిస్ గేల్.

టీ20 వరల్డ్ కప్ తర్వాత క్రిస్ గేల్ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. 2022లో జరిగిన ఐపీఎల్లోనూ క్రిస్ గేల్ ఆడలేదు. ఈ క్రమంలోనే 2023 ఐపీఎల్ సీజన్లో క్రిస్ గేల్ రీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. అయితే ఐపీఎల్ వేలం పాటలో తన పేరును క్రిస్ గేల్ రిజిస్టర్ చేసుకోలేదు. ఈ క్రమంలోనే ప్లేయర్ గా కెరీర్ ను ముగించిన క్రిస్ గేల్ తన రెండో ఇన్నింగ్స్ గా ఎక్స్ పర్ట్ అవతారం ఎత్తాడు.

2023 ఐపీఎల్ మినీ వేలంలో అనిల్ కుంబ్లే.. స్కాట్ స్టైరిస్‌‌లతో కలిసి విశ్లేషకుడిగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఇందులో భాగంగా క్రిస్ గేల్ తన పక్కనే కూర్చున్న అనిల్ కుంబ్లేపై వ్యగ్యాస్త్రాలు సంధించడం ఆసక్తికరంగా మారింది. 2023 సీజన్ కు మందు అనిల్ కుంబ్లే పంజాబ్ టీంకు హెడ్ కోచ్ గా వ్యవహరించాడు. ఆ టీములోనే క్రిస్ గేల్ ప్లేయర్ గా ఉన్నాడు.

అయితే నాడు అనిల్ కుంబ్లే క్రిస్ గేల్ ను రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేశాడు. ఈ విషయంపై క్రిస్ గేల్ మాట్లాడుతూ తనకు ఐపీఎల్ టైటిల్ గెలవడానికి కావాల్సిన అదృష్టం లేదనుకుంటా అని వ్యాఖ్యానించాడు. దీనికి అనిల్ కుంబ్లే సైతం సేమ్ టూ సేమ్ అని చెప్పుకొచ్చాడు. అనిల్ కామెంట్లపై క్రిస్ గేల్ స్పందిస్తూ తనకు కొన్ని అదృష్టం కలిసి రాలేదని చెప్పాడు.

అనిల్ కుంబ్లే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ లో లేడు. అతడు టీంలో ఉన్నప్పుడు తనను రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేశాడని.. కానీ ఇప్పుడు అతడినే పంజాబ్ టీమ్ తీసేసి నా పక్కన కూర్చో బెట్టిందంటూ చమత్కరించాడు. తనకు సరైన గుర్తింపు దక్కి ఉంటే ఈపాటికి ఇద్దరు ఐపీఎల్ టైటిల్ ను గెలిచేవాళ్లమోమో నంటూ క్రిస్ గేల్ కామెంట్ చేశాడు.క్రిస్ గేల్ మాటలకు ఏం చెప్పాలో తెలియక అనిల్ కుంబ్లే నవ్వుతూ మౌనంగా ఉండిపోయాడు.

పంజాబ్ కింగ్స్ తరుపున 2020, 2021 సీజన్లలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో క్రిస్ గేల్ ఆడాడు. ఈ రెండు సీజన్లలో క్రిస్ గేల్‌కి తుదిజట్టులో చోటుదక్కిన మ్యాచుల కంటే రిజర్వు బెంచ్‌కే ఎక్కువగా పరిమితమయ్యాడు. ఈ కారణంగానే 2021 సీజన్ మధ్యలోనే క్రిస్ గేల్ తప్పుకొని తనకి ఐపీఎల్లో సరైన గౌరవం దక్కలేదంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.