Begin typing your search above and press return to search.

నగ్నంగా టీవీ జర్నలిస్ట్.. వీడియో షేర్ చేసిన భార్య

By:  Tupaki Desk   |   10 Jun 2020 2:30 AM GMT
నగ్నంగా టీవీ జర్నలిస్ట్.. వీడియో షేర్ చేసిన భార్య
X
ఇంట్లో నగ్నంగా.. స్వేచ్చగా మనం తిరుగుతుంటాం. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ కెమెరాలో టిక్ టాక్ లు, సెల్పీల పిచ్చికి మనం అందరం బుక్కైపోతున్నాం.. తాజాగా టీవీ యాంకర్ కూడా అలానే సోషల్ మీడియాలోకి ఎక్కాడు. ప్రముఖ టీవీ యాంకర్, న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమో తమ్ముడు క్రిస్ క్యూమోకు చేదు అనుభవం ఎదురైంది.

క్రిస్ క్యూమో భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యోగా వీడియోలో అతడు నగ్నంగా కనిపించాడు. న్యూయార్క్ లోని హాంప్టన్ మాన్షన్ గార్డెన్ లో క్రిస్ భార్య క్రిస్టినా గ్రీవెన్ క్యూమో యోగా చేస్తోంది. ఇదే సమయంలో ఆమె భర్త టీవీ యాంకర్ క్రిస్ గార్డెన్ లోకి నగ్నంగా వచ్చి అటువైపు తిరిగి నిలబడ్డాడు. దీన్ని గమనించిన అతడి భార్య ఈ వీడియోను చూసుకోకుండా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు .. నగ్నంగా నిల్చుని ఉన్నది యాంకర్ క్రిస్’ అంటూ కామెంట్ చేయడంతో నాలుక కరుచుకున్న అతడి భార్య వెంటనే వీడియోను డిలీట్ చేసింది. అప్పటికే ఆ వీడియోను స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్న నెటిజన్లు క్రిస్ ఫొటోలను తిరిగి పోస్ట్ చేయడంతో ఈ యాంకర్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లాక్ డౌన్ లో ఖాళీగా ఉంటున్న వాటి వల్ల ఇలాంటి సంఘటనలు ఇంట్లో బోలెడు జరుగుతున్నాయి.