Begin typing your search above and press return to search.

జైల్లో ఊచలు లెక్కిస్తున్న వజ్రాల వ్యాపారి చోక్సీ

By:  Tupaki Desk   |   30 May 2021 9:30 AM GMT
జైల్లో ఊచలు లెక్కిస్తున్న వజ్రాల వ్యాపారి చోక్సీ
X
భారత్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. ఎంతో దర్జా అనుభవించిన అతడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయన జైల్లో ఉన్న ఫొటోను పోలీసులు శనివారం విడుదల చేయడంతో వైరల్ అయ్యింది.

జైల్లో చోక్సీని పోలీసులు చిత్రహింసలకు గురిచేసినట్లు చోక్సీ తరుఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ఆరోపించారు. చోక్సీ శరీరంపై గాయాలు కూడా ఉన్నట్లు చెబుతున్నాడు. ఎలా దర్జాగా ఉండే చోక్సీ ఎలా అయ్యాడని ఆ ఫొటో చూసి నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేల కోట్లు ఎగ్గొట్టి భారత్ నుంచి పారిపోయిన చోక్సీ కరేబియన్ దేశం అంటిగ్వాలో తలదాచుకున్నాడు. ఈనెల 25న అక్కడి నుంచి పారిపోయి దొంగ మార్గంలో డొమినికాకు చేరుకున్నాడు. ఇంటర్ పోల్ ఎల్లో నోటీస్ జారీ చేయడంతో పోలీసులు గుర్తించి డొమినికాలో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనను రిమాండ్ కు తరలించింది.

డొమినికా కోర్టులో చోక్సీ హెబిబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు. ఇది బుధవారం విచారణకు రానుంది. ఇక చోక్సీని భారత్ కు అప్పగించేందుకు ఇటు భారత్ తోపాటు డొమినికాతో చర్చలు జరుపుతున్నట్టు అంటిగ్వా ప్రధాని ఇటీవల తెలిపారు. డొమినికాలో దొరికిన చోక్సీని భారత్ కు పంపాలని ఆయన డొమినికా ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే చోక్సీ నేరాలకు సంబంధించిన పత్రాలతో భారత్ నుంచి ఓ ప్రత్యేక విమానం అంటిగ్వాకు చేరింది. వీటిని పరిశీలించిన ఆ దేశ ప్రధాని చోక్సీ పరారీలో ఉన్నాడని.. ఆర్థిక నేరగాడు అని ధ్రువీకరించారు.

2017లో మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. 2018లో పంజాబ్ కుంభకోణం బయటపడడంతో పరారీ అయ్యాడు. నీరవ్ మోడీ కూడా ఇందులో నిందితుడు. నీరవ్ కు స్వయానా చోక్సీ మేనమామ అవుతాడు. నీరవ్ ప్రస్తుతం బ్రిటన్ లో ఉంటున్నాడు.