Begin typing your search above and press return to search.

జగన్ పాలనలో బాబు సంక్షేమ ఫలాలు?

By:  Tupaki Desk   |   9 July 2019 12:50 PM IST
జగన్ పాలనలో బాబు సంక్షేమ ఫలాలు?
X
అధికారం మారింది.. చంద్రబాబు ఓడి జగన్ గెలిచారు. అధికారంలోకి రాగానే సంక్షేమ జల్లు కురిపించి దూకుడుగా ముందుకెళ్తున్నారు. పాలనలో పారదర్శకతను పాటిస్తూ ముందుకెళ్తున్నారు. అయితే జగన్ అధికారం చేపట్టి రెండు నెలలు దగ్గరకు వస్తున్నా ఇంకా అధికారులు మత్తు వీడడం లేదు. పోయిన చంద్రబాబునే ఇంకా తమ సీఎంగా భావిస్తున్నట్టున్నారు. ఇప్పుడు అధికారులు చేసిన ఓ పని వివాదాస్పదమైంది.

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఈసారి 13మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ఇద్దరు మంత్రులు కూడా అయ్యారు. అయితే అధికారులు మాత్రం ఇంకా టీడీపీ పేరిట చంద్రబాబు - గంటా ఫొటోలు ముద్రించి ఉన్న ఫొటోలను వైఎస్ ఆర్ జయంతి వేళ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేయడం వివాదాస్పదమైంది.

తాజాగా జగన్ పాలనలో చంద్రబాబు ఫొటోలతో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. వైసీపీ అభిమానులు - ప్రభుత్వం దీనిపై సీరియస్ అయ్యింది..

వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా జగన్ సర్కారు ప్రభబుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులకు పెద్ద ఎత్తున సైకిళ్లను కొని పంపిణీ చేస్తున్నారు. ఇక టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వం కొన్న సైకిళ్లను కూడా ఇప్పుడే పంపిణీ చేస్తున్నారు.

అయితే కొంత మంది అధికారులు ఆ టీడీపీ సైకిళ్లకు అంటించిన చంద్రబాబు - నాటి విద్యామంత్రి గంటా ఫొటోలను తీయకుండానే విద్యార్థులకు పంపిణీ చేయడం దుమారం రేపింది. విద్యాశాఖాధికారుల వైఖరిపై ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం - నాయకులు సీరియస్ అయ్యారు. చిత్తూరు జిల్లా పీలేరు జరిగిన ఈ సంఘటన దుమారం రేపింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇంకా చంద్రబాబు పేరుతోనే లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది.