Begin typing your search above and press return to search.
చెప్పినట్లే నితీష్ ను దెబ్బ కొట్టిన చిరాగ్
By: Tupaki Desk | 11 Nov 2020 12:20 PM ISTఎన్నికల ముందు నుండి చెబుతున్నట్లే చివరకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ గట్టి దెబ్బే కొట్టాడు. ఎన్నికల నగారా మోగి నప్పటి నుండి జేడీయు అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ఎన్డీయే సిఎం అభ్యర్ధి అయిన నితీష్ ను దెబ్బ కొడతానంటూ చిరాగ్ బహిరంగంగానే సవాలు విసిరారు. వాళ్ళ మధ్య గొడవలకు కారణం ఏమిటో తెలీకపోయినా నితీష్ ను మాత్రం ముఖ్యమంత్రి అవనిచ్చేది లేదంటు గట్టిగానే పంతం పట్టాడు. మధ్యవర్తిగా బీజేపీ నేతలు ఇద్దరికీ సయోధ్య కుదర్చటనికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవటంతో చివరకు ఎన్డీయే కూటమి నుండి చిరాగ్ బయటకు వెళ్ళిపోయారు.
జేడీయు పోటీ చేసే సీట్లు, బలంగా ఉన్న నియోజకవర్గంలో ఎల్జేపీ తరపున అభ్యర్ధులను దించారు. దాని ఫలితంగా జేడీయు పోటీ చేసిన 115 సీట్లలో గెలిచింది చివరకు 43 చోట్ల మాత్రమే. అంటే 72 నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఎల్జేపీ అభ్యర్ధుల దెబ్బ పడింది. ఎలాగంటే ఓడిపోయిన జేడీయూ అభ్యర్ధుల తేడాతో పోలిస్తే ఎల్జేపీ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లు ఎక్కువ. ఎల్జేపీ అభ్యర్ధులు తాము గెలవలేకపోయినా జేడీయు అభ్యర్ధుల ఓటమికి మాత్రం బాగా పనికొచ్చారన్న విషయం అర్ధమైపోయింది.
ఇపుడు నితీష్ కుమార్ నాలుగోసారి ముఖ్యమంత్రవ్వాలంటే కేవలం బీజేపీ దయమీదే అవ్వాలంతే. అదే పోటీ చేసిన సీట్లలో మెజారిటి సీట్లు గెలిచున్నా లేకపోతే బీజేపీ అభ్యర్ధులతో సమానంగా గెలిచున్నా రాజమార్గంలోనే సిఎంగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉండేది నితీష్ కు. తమ అభ్యర్ధులు ఓడిపోవటం ఒక ఎత్తైతే బీజేపీ దయమీద ఆధారపడాల్సి రావటం మరో ఎత్తుగా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల్లో తాను ముణగటమే కాకుండా జేడీయుని కూడా చిరాగ్ ముంచారు.
243 సీట్లలో పోటీ చేసిన ఎల్జేపీ గెలిచింది ఒకే ఒక్క సీటులో మాత్రమే. కనీసం 40 నియోజకవర్గాల్లో ఎల్జేపీ అభ్యర్ధుల దెబ్బ జేడీయు అభ్యర్ధుల విజయంపై తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషణల ప్రకారం తెలుస్తోంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎల్జేపీని ఏపిలో జనసేనతో పోల్చవచ్చు. ఎందుకంటే ఏపిలో కూడా 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధుల దెబ్బ కొన్ని నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్ధుల విజయావకాశాలపై పడింది. అలాగే గెలిచింది కూడా కేవలం ఒకే నియోజకవర్గంలో మాత్రమే. ఇక్కడ జనసేనకు వచ్చింది కూడా 5.6 శాతం ఓట్లయితే, బీహార్ లో ఎల్జేపీకి వచ్చిన ఓట్లు కూడా 5.6 శాతమే. ఇద్దరు కూడా తమను తాము చాలా ఎక్కువగా ఊహించుకునే ఎన్నికల్లో బోల్తా పడ్డారని అర్ధమైపోతోంది.