Begin typing your search above and press return to search.

పాశ్వాన్‌ జయంతి నాడు చిరాగ్ 'ఆశీర్వాద్‌ యాత్ర' !

By:  Tupaki Desk   |   21 Jun 2021 3:30 PM GMT
పాశ్వాన్‌ జయంతి నాడు చిరాగ్ ఆశీర్వాద్‌ యాత్ర  !
X
చిరాగ్‌ పాశ్వాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబసభ్యులే తనకు తీవ్రమైన వెన్నుపోటు పొడిచారని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నాయకుడు చిరాగ్‌ పాశ్వాన్‌ సంచలన ఆరోపణలు చేశాడు. ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యనిర్వాహక సమావేశం తర్వాత , ఆయన మాట్లాడుతూ పై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో సుమారు 90 శాతం మంది కార్యనిర్వాహకులు హాజరయ్యారని, తమదే అసలైన ఎల్జేపీ అంటూ చెప్పుకొచ్చారు. తన బాబాయ్‌, ఎల్జేపీ పార్లమెంటరీ పక్ష నేత పశుపతి కుమార్‌ పరాస్‌ వర్గం తమదే అసలైన ఎల్జేపీ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో చిరాగ్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తో ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. జులై 5 నుంచి బీహార్‌లో ‘ఆశీర్వాద్‌ యాత్ర'ను చేపట్టనున్నట్టు చిరాగ్‌ ప్రకటించారు. తన తండ్రి, దివంగత నాయకుడు రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ జయంతి అయిన జూలై 5న.. బీహార్‌లోని హజీపూర్‌ నియోజకవర్గం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది. కాగా, ఢిల్లీలో చిరాగ్‌ అధ్యక్షతన జరిగిన జాతీయ కార్యనిర్వాహక వర్గం అసలైంది కాదని, అందులో పాల్గొన్నవారిలో సగం మంది 'కిరాయిదారులు' అని పశుపతి కుమార్‌ ఎద్దేవా చేశారు. ఎల్జేపీ అధ్యక్షుడిని నిర్ణయించేది ఎన్నికల కమిషన్‌ అని తేల్చి చెప్పారు. చిరాగ్‌ అక్రమంగా అధ్యక్ష పదవి చేపట్టారని, అది చెల్లదని పరాస్‌ ఆరోపణలు చేశారు.

కేంద్ర మాజీమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయిన తర్వాత పార్టీ నిలువుగా చీలిపోయిన విషయం తెలిసిందే. జాతీయ అధ్యక్షడు, ఎంపి అయిన చిరాగ్ ను స్వయంగా బాబాయ్ పశుపతి కుమార్ పారస్ పదవిలో నుండి దింపేసిన విషయం తెలిసిందే. పదవిలో నుండి దింపటంతో సరిపెట్టుకోకుండా ఏకంగా పార్టీని నిట్టనిలువుగా చీల్చేశారు. పార్టీలో హఠాత్తుగా సంభవించిన పరిణామాలతో చిరాగ్ కు షాక్ కొట్టినట్లయ్యింది. దాంతో పార్టీ మీద ఆధిపత్యం తమదంటే తమదంటు రెండు వర్గాలు రోడ్డెక్కాయి. చివరకు ఈ వివాదం ఒకవైపు కేంద్ర ఎన్నికల కమీషన్ ముందుకు చేరింది. ఇదే సమయంలో లోక్ సభ స్పీకర్ కు కూడా రెండువర్గాలు ఒకదానిపై ఇంకోటి ఫిర్యాదులు చేసుకున్నాయి. మరి ఈ వివాదాన్ని ఎన్నికల కమీషన్ , లోక్ సభ స్పీకర్ ఏ విధంగా పరిష్కారనే విషయం ఆసక్తిగా మారింది. చిరాగ్ కు ఇలాంటి పరిస్ధితి రావటానికి స్వయంకృతమే అన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. రామ్ విలాస్ ఉన్నపుడు పార్టీలోని కీలక నేతలతో మంతనాలు జరిపి నిర్ణయం తీసుకునేవారు. కానీ చిరాగ్ చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్డీయేలో ఉంటూనే మరో భాగస్వామ్య పార్టీ జేడీఎస్ కు వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను పోటీలోకి దింపారు.ఇదిలా ఉంటే .. సాధరణంగా యాత్రలు చేయడం అనేది సౌత్ రాష్ట్రాల నాయకులకి కొత్తేమి కాదు. తమ పార్టీని , తమ మాటలని ప్రజలలోకి బాగా బలంగా తీసుకుపోవాలనే లక్ష్యంతో ఇప్పటికే ఎంతోమంది నేతలు యాత్రలు చేశారు , అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఇదే అస్త్రాన్ని చిరాగ్ కూడా వడబోతున్నారు. చూడాలి మరి చిరాగ్ వెనుక ఎంతమంది నిలుస్తారో.