Begin typing your search above and press return to search.

చింత‌మ‌నేనికి కొత్త చింత‌..ఎందుకు..ఏమిటి...?

By:  Tupaki Desk   |   21 Oct 2019 9:14 AM GMT
చింత‌మ‌నేనికి కొత్త చింత‌..ఎందుకు..ఏమిటి...?
X
కేసుల‌పై కేసులు.. రిమాండ్‌ పై రిమాండ్లు.. ఇదేదో సాధార‌ణ ఖైదీ అయితే - పెద్ద‌గా చ‌ర్చ‌కు వ‌చ్చేది కాదు. రాజ‌కీయ యోధుడుగా త‌న‌కు తిరుగులేని ఆధిపత్యం దూసుకుపోయిన నాయ‌కుడు.. వ‌రుస విజ‌యాలు సాధించి రాజ‌కీయంగా గుర్తింపు తెచ్చుకున్న నేత‌ - టీడీపీలో కీల‌కంగా చ‌క్రం తిప్పిన నాయ‌కుడు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఇప్పుడు తీవ్ర‌మైన చింత‌ల్లో కూరుకు పోయారు. 2009 - 2014లో ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్నారు. అయితే, ప్ర‌జ‌లు ఇచ్చిన అధికారం - పార్టీ అధికారంలో ఉండ‌డంతో ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శించారు.

త‌న మాట‌కు తిరుగులేద‌ని అన్నట్టుగా - త‌న చేతల‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేర‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించి చిక్కు లు కొని తెచ్చుకున్నారు. ఫ‌లితంగా అనేక కేసుల్లో చిక్కుకున్నారు. టీడీపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు అప్ప‌ట్లో తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ద‌ళితుల‌ను దూషించార‌ని - అధికారుల‌పై చేయి చేసుకున్నారని - ప‌రుషంగా తిట్టిపోశార‌ని.. ఇలా లెక్క‌కు మిక్కిలిగా ఆయ‌న‌పై కేసులు న‌మోదయ్యాయి. ఇక్క‌డ చిత్ర‌మేంటంటే.. ఆ కేసుల‌న్నీ కూడా టీడీపీ అధికారంలో ఉండ‌గా న‌మోదైన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. అప్ప‌ట్లో ఆయ‌న కేసులేగా పెట్టుకోండి? అన్న ధోర‌ణిలో లైట్ తీసుకున్నారు.

నిజానికి మ‌ళ్లీ టీడీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని - తానే మ‌రోసారి అంటే ముచ్చ‌ట‌గా మూడో సారి కూడా వి జ‌యం సాధిస్తాన‌ని - కాబ‌ట్టి కేసులు న‌మోదు చేసుకుంటే.. మాత్రం త‌న‌ను ఎవ‌రు ఏం చేస్తార‌ని అనుకు న్నారు. కానీ, ప‌రిస్తితులు ఎప్పుడు కూడా ఒకేలా ఉండ‌వు క‌దా! ఇప్పుడు కూడా అదే జ‌రిగింది. రాజ‌కీయ చ‌క్రం త‌ల‌కిందులైంది. టీడీపీ అదికారంలోకి రాలేదు. ఆయ‌న మూడో సారి గెలవ‌నూ లేదు. దీంతో ఇప్పు డు పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవ‌డం ప్రారంభించారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతో స‌హ‌జం గానే పోలీసుల‌పై ఒత్తిడి పెరిగింది. పెండింగు కేసుల‌ను తిర‌గ‌దోడుతున్నారు.

అనేక కేసులు - ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 11న అరెస్ట్ చేసిన పోలీసులు ఒకటి తర్వాత మరో కేసును బయటకు తీస్తూ - నెలరోజులుగా చింతమనేనిని జైల్లోనే ఉంచారు. తాజాగా మరో 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలు నుంచి కోర్టుకు వచ్చిన చింతమనేని - మళ్లీ జైలుకే వెళ్లారు. అట్రాసిటీ కేసులు ఓ వైపు - అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు మరోవైపు - ఇలా అన్ని రకాల కేసులను తిరగదోడుతూ జైలు జీవితానికే పరిమితం చేస్తున్నారు. మొత్తం ఐదు కేసుల్లో రిమాండ్‌ లో ఉన్న చింతమనేని ప్రభాకర్‌ కు అక్టోబర్ 9వ తేదీతో రిమాండ్ పూర్తవడంతో - ఆయన బెయిల్ పై బయటకు వస్తారని ఆయన కుటుంబ సభ్యులు - అనుచరులు - కార్యకర్తలు ఆశించారు.

జిల్లా జైలుకు భారీగా చేరుకున్న అభిమానుల మధ్య పోలీసులు మరోసారి జైలులోనే పీటీ వారెంట్ పై అరెస్ట్ చేసి - కోర్టుకు తరలించారు. అప్పటికే సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 9 వరకూ నెలరోజులుగా ఏలూరులో జైలులోనే ఉన్న చింతమనేని ప్రభాకర్ పై - మరో కేసులో కోర్టులో హాజరు పరచగా - 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఇంకో కేసులో - అక్టోబర్ 23 వరకూ రిమాండ్ విధించింది కోర్టు. ఈ ప‌రిణామంతో ఇన్నాళ్లు లైట్ తీసుకున్న చింత‌మ‌నేని.. ఇప్పుడు మ‌ద‌న ప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో టీడీపీ నుంచి ఆశించిన విధంగా ఆయ‌న కు మ‌ద్ద‌తు కూడా ద‌క్క‌క పోవ‌డం - టీడీపీ హ‌యాంలోనే ఆయ‌న‌పై ఇన్ని కేసులు న‌మోద‌య్యేలా సొంత నాయ‌కులే చ‌క్రం తిప్ప‌డం వంటివి మ‌రీ క‌లిచి వేస్తున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చింత‌మ‌నేని కుమిలి పోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.