Begin typing your search above and press return to search.

చిన్న‌జీయ‌ర్ విష‌యంలో.. కేసీఆర్ దాచిన నిజం.. నేడు క‌ళ్ల ముందు.. ప్ర‌త్య‌క్షం

By:  Tupaki Desk   |   27 March 2022 3:30 PM GMT
చిన్న‌జీయ‌ర్ విష‌యంలో.. కేసీఆర్ దాచిన నిజం.. నేడు క‌ళ్ల ముందు.. ప్ర‌త్య‌క్షం
X
కొన్ని కొన్ని నిజాల‌ను ఎవ‌రూ దాచ‌లేరు. క‌ళ్ల‌ముందు క‌నిపించే ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు.. ఆ నిజాల‌ను దాచి నా అర్ధం ఉండ‌దు. ఎందుకంటే... వాటికి అంత బ‌లం ఉంటుంది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వ‌చ్చిందంటే.. తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి రాజ‌మ‌ర్యాద‌లు అందుకుని.. ఏకంగా... కేసీఆర్‌కు స‌ల‌హాలు ఇచ్చే గురువుగా కీర్తి పొందిన‌.. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి వ్య‌వ‌హారంలో స్ప‌ష్ట‌త క‌ళ్ల‌ముందు క‌దులుతోంది కాబట్టి!

కొన్నాళ్లుగా.. అటు కేసీఆర్‌.. ఇటు.. జీయ‌ర్ స్వామిల మ‌ధ్య బంధం.. ఏ రేంజ్‌లో సాగిందో తెలిసిందే. యా దాద్రి పున‌ర్నిర్మాణానికి ప్లాను.. స‌ల‌హాలు ఇచ్చిన జీయ‌ర్ స్వామితో సీఎం కేసీఆర్ రాసుకుని పూసుకుని తిరిగారు. ఈ క్ర‌మంలో జీయ‌ర్ స్వామి నెల‌కొల్పిన రామానుజుల విగ్ర‌హ కార్య‌క్ర‌మానికి కూడా కేసీఆర్ అదేవిధంగా స‌హ‌క‌రించారు. అయితే.. ఇంత బందం కూడా.. చిన్న తేడాతో విరిగిపోయింది. సమతామూర్తి రామానుజ విగ్రహావిష్కరణ వేడుకలకు చిన జీయర్ కేంద్రంలోని బీజేపీ పెద్దలందరినీ తీసుకురావడం ద్వారా కేసీఆర్కు ఆయ‌న‌కు దూరం పెరిగింది.

అప్పటికే కేంద్రంలోని బీజేపీమీద కేసీఆర్ యుద్ధం ప్రకటించి.. దేశ‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ పెద్ద‌ల‌ను ఆహ్వానించ‌డ‌డం.. వారిని కొనియాడ‌డం వంటివి.. కేసీఆర్‌కు న‌చ్చ‌లేదు. చినజీయర్ ను కలిసిన ప్రతిసారీ అత్యంత భక్తి ప్రపత్తులతో సాష్టాంగపడి ఆయన కాళ్లు మొక్కే అలవాటు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కనీసం సమతామూర్తి విగ్ర‌హ స్థాప‌నంలో చివ‌రి ఘ‌ట్ట‌మైన శాంతి క‌ళ్యాణానికి వెళ్లలేదు. దీంతో చిన్న‌జీయ‌ర్‌.. ప‌రిస్థితి.. హఠాత్తుగా మసకబారిపోయింది.

ఈ క్ర‌మంలోనే అనేక విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. ఇంకేమంది..జీయ‌ర్‌కు కేసీఆర్‌కు మ‌ధ్య చెడిపోయింద‌ని.. వాద‌న‌లు వినిపించాయి. కానీ, కేసీఆర్ వీటిని తొసిపుచ్చారు. మీడియాకు ప‌నిలేద‌ని అందుకే ఇలాంటి వార్త‌లు రాస్తోంద‌ని.. ఎదురు దాడి చేశారు. దీనికి ముందు విజ‌యవాడ‌లో మాట్లాడిన జీయ‌ర్ స్వామి.. గ్యాప్ పై ఆస‌క్తిక‌రంగా స్పందించారు. తాము ఎవ‌రితోనూ గ్యాప్ కోరుకోవ‌డం లేద‌న్నారు. ఎవ‌రైనా గ్యాప్ ఉండాల‌ని కోరుకుంటే.. తాము ఏమీ చేయ‌లేమ‌న్నారు.

కానీ, కేసీఆర్ మాత్రం గ్యాప్‌లేద‌న్నారు.కానీ, తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చిన్న‌జీయ‌ర్ స్వామి చిన్న‌బోయేవిష‌యాలే.. ఇప్పుడు చోటు చేసుకున్నాయి. యాదాద్రి ఉద్ఘాట‌న‌కు, పున‌ర్నిర్మాణానికి ముహూర్తం పెట్టింది చినజీయరే అయినప్పటికీ.. యాదాద్రి ఉద్ఘాటనకు కనీసం ఆయనకు ఆహ్వానం అందలేదు.

నిజానికి ఆలయ పునర్నిర్మాణం చాలావరకు ఆయన కనుసన్నల్లోనే జరిగింది. ఆయ‌న స‌ల‌హా మేర‌కు ఆర్కిటెక్ట్‌ను కూడా నియ‌మించుకున్నారు. కానీ, ప్రారంభం వేళకు ఆయనను పక్కన పెట్టారు. సో.. దీనిని బ‌ట్టి.. కేసీఆర్ దృష్టిలో.. ఇక‌, ఆయ‌న `చిన్న‌..` జీయ‌రే! అని అనుకోవాలేమో!!