Begin typing your search above and press return to search.

భార‌త్ తో పంచాయితీ చైనీయుల‌కు ఇష్టం లేదా?

By:  Tupaki Desk   |   5 Aug 2017 10:14 AM IST
భార‌త్ తో పంచాయితీ చైనీయుల‌కు ఇష్టం లేదా?
X
నిద్ర లేచింది మొద‌లు ఇరుగుపొరుగు దేశాల‌తో ఏదో ర‌కంగా లొల్లి పెట్టుకునే చైనా విష‌యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రమే లేదు. త‌న చుట్టూ ఉన్న స‌రిహ‌ద్దు దేశాల‌తో ఏదో ర‌కంగా పంచాయితీలు పెట్టుకునే డ్రాగ‌న్ తీరును ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లువురు త‌ప్పు ప‌డుతుంటారు. అంద‌రి సంగ‌తి ఇలా ఉంటే.. త‌మ అధికార‌ప‌క్షం తీరు గురించి చైనీయుల మైండ్ సెట్ ఏమిటి? అదే ప‌నిగా లొల్లి పెట్టుకునే త‌మ ప్ర‌భుత్వ తీరుపై వారు ఎలా ఆలోచిస్తున్నార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎందుకంటే.. చైనాలో ఫేమ‌స్ అయిన ఒక వెబ్ సైట్‌.. తాజాగా చైనా స‌ర్కారు చేస్తున్న త‌ప్పుల్ని ఒక ఆర్టిక‌ల్ లో త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. భార‌త్ తో యుద్ధం చైనాకు ఏ మాత్రం మంచిది కాద‌న్న విష‌యాన్ని హెచ్చ‌రించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

చైనాలో ఎక్కువ‌మంది ఫాలో అయ్యే వెబ్ సైట్ల‌లో జిహు.కామ్ ఒక‌టి. ఇందులో ప్ర‌చురిత‌మైన వ్యాసాల్ని చైనీయులు పెద్ద ఎత్తున చ‌దువుతుంటారు. ప్ర‌జ‌ల మైండ్ సెట్ ను ప్ర‌తిఫ‌లించేలా ఈ సైట్లో వ్యాసాలు ఉంటాయ‌న్న పేరుంది. అంత‌టి పాపుల‌ర్ వెబ్ సైట్లో తాజాగా పబ్లిష్ అయిన వ్యాసం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.

స‌ద‌రు వ్యాసంలో చైనా తీరును త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. ప‌లు అంశాల్లో చైనా స‌ర్కారు అనుస‌రిస్తున్న వైనాన్ని విమర్శించ‌టం విశేషం. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ చైనాలో భాగ‌మ‌ని వాదించ‌ట‌మే కాదు.. భార‌త్ లో భాగ‌మైన ఈ ప్రాంతానికి సంబంధించి కొన్ని ఊరి పేర్ల‌ను తాజాగా మారుస్తూ చైనా నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. ఈ తీరును జిహు.కామ్ త‌న వ్యాసంలో త‌ప్పు ప‌ట్టింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ తో భార‌త్‌ కు ఉన్న అనుబంధాన్ని ఎవ‌రూ విడ‌దీయ‌లేర‌ని భార‌త్ గ‌ట్టిగా చెప్పింది. ఇదే విష‌యాన్ని తాజాగా జిహు.కామ్ ప్ర‌స్తావిస్తూ.. స‌రిహ‌ద్దుల విష‌యంలో భార‌త్ - చైనాకు మ‌ధ్య ఉన్న వివాదాల్ని తాజాగా త‌ప్పు ప‌ట్టారు. భార‌త్ తో ఉన్న స‌రిహ‌ద్దు వివాదాల వ‌ల్ల చైనాకు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని.. డోక్లామ్ ఇష్యూ హాట్ హాట్ ఘా న‌డుస్తున్న వేళ ఆర్టిక‌ల్ రావ‌టం గ‌మ‌నార్హం.

దేశ అభివృద్ధిని దెబ్బ తీయ‌టంతో పాటు.. ఇదో అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుగా స‌ద‌రు వ్యాసం రాసిన చైనీయుడు వాంగ్ టావో టావో అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. త‌న క‌థ‌నంలో ఆయ‌న‌.. స‌రిహ‌ద్దు వివాదాల గురించి ప్ర‌స్తావిస్తూ.. చైనా కానీ యుద్ధానికి దిగితే అభివృద్ధిని దెబ్బ తీయ‌ట‌మే కాదు.. ఆర్థిక‌ప‌రంగా కూడా అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుగా అభివ‌ర్ణించ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. స‌రిహ‌ద్దుల విష‌యంలో చైనా కానీ యుద్ధానికి దిగితే న‌ష్ట‌పోవ‌టం ఖాయ‌మ‌న్న మాట‌ను త‌న క‌థ‌నంలో పేర్కొన‌టం గ‌మ‌నార్హం.