Begin typing your search above and press return to search.

అమ్మ చైనా ... ఎంత కుట్ర !

By:  Tupaki Desk   |   21 July 2020 8:00 AM IST
అమ్మ చైనా ... ఎంత కుట్ర !
X
చైనా ... కుట్రలకు , కుతంత్రాలకు మరోరూపం. తాము ఎదగటానికి ఎదుటివాడి పతనాన్ని కోరుకునే చైనా ఎంతటి దుశ్చర్యలకి అయినా పాల్పడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు అది నిరూపితమైంది. అలాగే దొంగదెబ్బ తీయడం చైనా నైజం. ఆ తర్వాత మళ్లీ శాంతి చర్చలు అని ముందుకు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్తుంది. ఏదేమైనా చైనా కుట్రలు చేయడం ఆపలేదు అని మరోసారి తేటతెల్లం అయింది.

గత నెలలో భారత్ , చైనా సరిహద్దు లో గాల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఆ ఘటనకి ప్రతి ఘటనగా భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే చైనీస్ యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో చైనాకు పెద్ద ఎత్తున ఆర్ధిక నష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు భారత్ చూపిన దారిలో పలు దేశాలు అడుగులు వేస్తుండటం తో చైనా భారత్ పై మండిపడుతుంది. దీనితో భారత ఆస్తులే లక్ష్యంగా పరోక్ష దాడులకు దిగేందుకు కుట్రలు చేస్తోంది.

ఇటీవల మయన్మార్‌- థాయిలాండ్‌ బార్డర్‌ లో పెద్ద ఎత్తున ఆయుధాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు మయన్మార్, థాయిలాండ్ పోలీసులు. పెద్ద ఎత్తున చైనాకు చెందిన ఏకే-47 అసాల్ట్ రైఫిల్స్‌, యాంటీ ట్యాంక్ మైన్స్‌, గ్రేనేడ్స్‌, మెషిన్ గ‌న్స్‌ తో పాటు..పలు ఆయుధాలను సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా సంచలన విషయాలు బయటపడ్డాయి.ఆయుధాలను బంగ్లాదేశ్‌ పక్కనే ఉన్న రాఖైన్ రాష్ట్రంలో పనిచేస్తున్న అరకాన్‌ ఆర్మీకి అందించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అయితే వీరు చెప్పినట్లు అరకాన్ సైన్యం ఇలాంటి ఆయుధాలను వాడటం లేదని తేలింది. స్వాధీనం చేసుకున్న ఆయుధాలన్నీ చైనాకు చెందినవే. అయితే ఈ ఆయుధాలను మయన్మార్, బంగ్లాదేశ్‌ లో ఉన్న చిన్న చిన్న ఉగ్ర సంస్థలకు అందజేసి ..వారితో భారత్ పై దాడి చేయించి దేశంలో అలజడి సృష్టించాలని చైనా ప్లాన్ చేసినట్టు ఇంటలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడించాయి.