Begin typing your search above and press return to search.

మళ్లీ మళ్లీ అదే తప్పు .. అరుణాచల్‌లో 200 మందితో చైనా చొరబాటు

By:  Tupaki Desk   |   8 Oct 2021 7:35 AM GMT
మళ్లీ మళ్లీ అదే తప్పు .. అరుణాచల్‌లో 200 మందితో చైనా చొరబాటు
X
సరిహద్దుల్లో రెండు రోజుల కిందట చైనా సైన్యం చొరబాటును భారత దళాలు తిప్పికొట్టినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతవారం వాస్తవాధీన రేఖను దాటి అరుణాచల్ ప్రదేశ్‌‌ లోని తవాంగ్ వద్ద చైనా సైనికులు ప్రవేశించాయని, భారత అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిందని పేర్కొన్నాయి. ఈ సమయంలో పలువురు చైనా సైనికులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఘర్షణ జరిగిన ప్రాంతంలో వాస్తవాధీన రేఖను గుర్తించడంలో వ్యత్యాసం ఉందని, ఇరు దేశాలూ తాము ఎల్ఏసీగా భావిస్తోన్న ఇక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

భారత్, చైనా సైనికుల ఒకరొనొకరు నెట్టించున్నారని, కొద్ది గంటల తర్వాత ఇరువురూ వెనక్కు వెళ్లారని తెలిపాయి. అయితే, ఆ ప్రాంతంలో భారత్ సైన్యానికి ఎటువంటి నష్టం జరగలేదని చెప్పాయి. బంకర్లను ధ్వంసం చేయడానికి చైనా ప్రయత్నించగా, భారత్ ప్రతిఘటనతో పలాయనం చిత్తగించాయి. గతంలో ఈ ప్రాంతం వద్ద చైనా చాలా సార్లు చొరబడినట్టు వివరించాయి. ఉత్తరాఖండ్‌ లోకి చైనా సైన్యం చొచ్చుకొచ్చిన నెల రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 30న సుమారు 100మంది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ ఏ) సైనికులు ఎల్ ఏ సీ నుంచి ఐదు కిలోమీటర్ల ముందుకు వచ్చి ఉత్తరాఖండ్‌ లోని బారాహొతీలోకి చొరబడ్డారు. గుర్రాలతో వచ్చిన వీరు సుమారు 3 గంటలపాటు ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

అక్కడి ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని చైనా సైనికులు నాశనం చేశారని, అయితే, భారత బలగాలతో ఎటువంటి ఉద్రిక్తత చోటుచేసుకోలేదని తెలిపాయి. బలగాలు అక్కడికి చేరుకునేసరికే పీఎల్‌ ఏ సైనికులు ఉడాయించారని పేర్కొన్నాయి. బారాహోటిలోని వంతెనను చైనా సైనికులు ధ్వంసం చేస్తున్నారని స్థానికులు భారతీయ భద్రతా దళాలకు సమాచారం అందజేశారు. దీనితో వెంటనే భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందాలు ఈ ప్రాంతానికి వెళ్లాయి. ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో టిబెట్ సరిహద్దు 545 కిలోమీటర్ల మేరకు సెంట్రల్ సెక్టర్‌లో ఉంది.

దీనిలో దాదాపు 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగంపై భారత్-చైనా మధ్య వివాదం ఉంది. ఈ భూభాగం ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో ఉంది. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో బారాహోటి ఉంది. ఇది చైనా సరిహద్దుల్లో ఉంది. నందా దేవి నేషనల్ పార్క్‌కు ఉత్తర దిశలో ఉంది. 2017 జూలైలో చైనా సైనికులు రెండుసార్లు ఈ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడ్డారు. అప్పట్లో డోక్లాం వద్ద చైనా-భారత్ మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. రెండు రోజుల క్రిత‌మే తైవాన్ గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించి ఆదేశాన్ని ఆక్ర‌మించుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టుగా ప్ర‌పంచానికి చెప్పిన చైనా, ఇప్పుడు ఇండియాలోని తవాంగ్‌లోకి ప్ర‌వేశించి మ‌రోసారి రెండు దేశాల మ‌ధ్య ర‌గ‌డ‌కు తెర‌తీసింది. దీనిపై భార‌త ప్ర‌భుత్వం, ర‌క్ష‌ణ శాఖ ఎలా స్పందిస్తాయో చూడాలి.