Begin typing your search above and press return to search.
చైనా చిటికేస్తే.. టాప్ 100 దిగ్గజ కంపెనీలు మటాషేనా?
By: Tupaki Desk | 18 Sept 2020 10:45 AM ISTచైనా ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యే రిపోర్టు ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పటికే కరోనాకు కారణమైన దేశంగా చైనాను యావత్ ప్రపంచం వేలెత్తి చూపిస్తోంది. వారు చేసిన తప్పులకు.. ప్రపంచ ప్రజలు శిక్ష అనుభవించాల్సి వస్తోందని.. వేలాది లక్షల కోట్ల రూపాయిల నష్టంతో పాటు.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన దుస్థితి చోటు చేసుకుంది.
ఈ కారణంగానే.. గతంలో పోలిస్తే ఇప్పుడు చైనా అంటే చాలు.. ప్రపంచంలోని చాలా దేశాల్లోని ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది సరిపోదన్నట్లుగా.. తన దేశ సరిహద్దు దేశాలతో గిల్లి కజ్జాలు పెట్టుకోవటం.. వారిని కెలకటం లాంటివి చేస్తోంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు చైనాకు కోపాన్ని తెప్పిస్తుంటే.. ప్రపంచ వ్యాప్తంగా మోడీని హీరోగా మార్చేస్తున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా చైనా ఆరాచకం ఒకటి వెలుగు చూసింది. ప్రపంచంలోని టాప్ 100కి పైగా దిగ్గజ కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల్లో చైనా కనుసైగతో.. వారు చెప్పినట్లుగా చేయటానికి చాలామంది ఉన్నట్లుగా చెబుతున్నారు. అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం.. చైనీస్ హ్యాకర్స్ ప్రపంచంలోని పలు కంపనీల్లో.. వారి తరఫున పని చేస్తున్నట్లుగా ఆరోపించింది.
దీంతో.. చైనా చిటికేస్తే చాలు.. కార్పొరేట్ కంపెనీల లెక్క తేల్చేయటమే కాదు.. వారు కుదేలు అయ్యేలా దరిద్రపు గొట్టు ప్లాన్ ఒకటి అమలు చేస్తున్నట్లుగా సదరు రిపోర్టు చెబుతోంది. ప్రపంచంలోనే టాప్ 100 కంపెనీల్లో చైనా హ్యాకర్స్ ఇప్పటికే పని చేస్తున్నారని.. వారు తలచుకుంటే.. సదరు కంపెనీలను కుప్పకూలిపోయేలా చేసే సామర్థ్యం ఉందంటూ అమెరికా నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ సైబర్ దాడి ద్వారా చైనా తన ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చేలా.. ప్రపంచంలో సూపర్ పవర్ లా మారటానికి ఈ పాడు ప్రయత్నం సాయం చేస్తుందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్ వ్యవస్థలపై ఉద్దేశ పూర్వకంగా చైనా సైబర్ దాడులకు కారణమవుతుందని డిప్యూటీ అటార్నీ జనరల్ రోచెన్ ఆరోపిస్తున్నారు.
ఈ వాదనకు బలం చేకూరేలా ఇప్పటికే సైబర్ చౌర్యానికి సంబంధించిన కేసులో మలేషియాలో వాంగ్ ఓంగ్ హువా.. లింగ్ యాంగ్ చింగ్ అనే ఇద్దరు పారిశ్రామికవేత్తల్ని అరెస్టు చేశారు. వీరిని విచారించే సమయంలో హ్యాకర్లు మాల్ వేర్లు వ్యాప్తి చేయటానికి వీడియో గేమ్ పంపిణీదారులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా తెలపటం గమనార్హం.