Begin typing your search above and press return to search.

చైనాలో పుట్టుకొచ్చిన కొత్త మహమ్మారి.. పొరుగుదేశంపై పంజా

By:  Tupaki Desk   |   6 July 2020 4:45 AM GMT
చైనాలో పుట్టుకొచ్చిన కొత్త మహమ్మారి.. పొరుగుదేశంపై పంజా
X
ప్రపంచంపైకి కొత్త వైరస్ లను వదిలి అందరినీ కబళించే ఖర్ఖానాగా చైనా మారుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ ను పుట్టించి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న చైనాలో కొత్త వైరస్ లు పుడుతున్నాయి. ఇప్పటికే చైనాలో జీ4 అనే కొత్త వైరస్ పందుల నుంచి మనుషులకు వ్యాపించింది. అది మరిచిపోకముందే చైనాలో తాజాగా ‘బుబోనిక్ ప్లేగు’ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ కొత్త బుబోనిక్ ప్లేగు వ్యాధితో జ్వరం, తలనొప్పి, చలి, వాపులు, లింప్ గ్రంథుల్లో నొప్పి, శరీరంపై పుండ్లతో బాధపడుతారు. ఇప్పటికే ఈ వైరస్ సోకిన ఓ వ్యక్తిని చైనా ఉత్తర ప్రాంతంలోని బయన్నుర్ నగర వైద్యులు గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులను, సన్నిహితులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ వైరస్ నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు లెవెల్-3 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఇప్పటికే ఈ వైరస్ చైనాకు ఉత్తర సరిహద్దుకు ఆనుకొని ఉన్న మంగోలియా దేశంలోనూ వేగంగా వ్యాపిస్తోంది.

ప్లేగు లోని ఓ రకం వ్యాధిగా దీన్ని గుర్తించారు. బుబోనిక్ ప్లేగుగా దీనికి పేరు పెట్టారు. ఇన్ఫెక్షన్లకు ఎర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా కారణం అని తేల్చారు.

ఈ ప్లేగు వ్యాధి ఎలుకలు, గుమ్మడి పురుగులను వాహకాలుగా వాడుకుంటుంది. మర్మోట్ జాతికి చెందిన ఎలుకలను తిన్న వారికి ఈ వ్యాధి చైనాలో సోకిందని.. అది బాగా వ్యాపిస్తోందని సమాచారం. ఎలుకలు, గుమ్మడి పురుగులు మనుషులను కుడితే బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరి వ్యాధులను కలుగజేస్తుందని కూడా వైద్యులు తెలిపారు. సాధారణంగా ఎలుకలను తినడం చైనీయులకు అలవాటు. ఆ అలవాటే మరో మహమ్మారి ప్లేగు వ్యాప్తికి కారణం అని అనుమానిస్తున్నారు.

ఇప్పుడు చైనాలో మర్మోట్ జాతి ఎలుకలు తినవద్దంటూ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కరోనా, జీ4 వంటి వైరస్ లను పుట్టించిన చైనాలో మరో మహమ్మారి ప్రజలను కబళించేందుకు రెడీ కావడం ఆందోళన కలిగిస్తోంది.