Begin typing your search above and press return to search.
ఎల్ ఏసీ వద్ద అష్టకష్టాలు పడుతున్న చైనా సైన్యం !
By: Tupaki Desk | 25 Nov 2020 4:20 PM ISTతూర్పు లడఖ్ లోని ఎల్ ఏ సీ వెంబడి ఉన్న చైనా సైన్యం అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో అక్కడ విపరీతమైన చలి పుడుతుంది. భయంకరమైన చలిలో సైన్యం దుస్తుల కొరతతో తిప్పలు పడుతున్నారు చైనా సైనికులు. దుర్భరమైన పరిస్థితులు, అతి తక్కువ ఉష్ణోగ్రతలు, కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య చైనా సైనికుల మనోధైర్యం సన్నగిల్లిందని నిఘా వర్గాలు వెల్లడించాయి.సైనికుల మనో ఉల్లాసం కోసం చైనా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. భారత సరిహద్దులో యథాతథ స్థితిని సవాల్ చేస్తూ సైన్యాన్ని ఎల్ ఏసీ వద్ద భారీగా మోహరించింది చైనా. వేలాది మంది సైనికులను వాస్తవాధీన రేఖకు చేర్చింది.
ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడం వల్ల చైనా సేనలు తీవ్ర అవస్థలు పడుతున్నారని అధికారులు తెలిపారు. వారి నైతిక స్థితి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వీరికి ధైర్యం కల్పించేందుకు వినోద కేంద్రాలను చైనా ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిట్ నెస్ సెంటర్లు, వేడినీటి ఈత కొలనులు, హాట్ టబ్ లు , గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పాయి. వినోద కేంద్రాలలో కంప్యూటర్లు, ప్లే స్టేషన్లను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాయి.భారత్ లో ని చుషుల్ కి సమీపంలో ఉండే మోల్డోని సైనిక శిబిరంలో ఇలాంటి ఓ వినోద కేంద్రం నెలకొల్పినట్లు వివరించాయి.
విపరీతమైన చలి ఉన్న నేపథ్యంలో చైనా సైనికులు సరైన దుస్తులు, వసతి సౌకర్యాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. శీతల వాతావరణాన్ని తట్టుకొనే ప్రత్యేకమైన దుస్తుల కొరత ఏర్పడిందని, వీటిని అత్యవసరంగా కొనుగోలు చేసేందుకు చైనా ఏర్పాట్లు చేసుకుందని తెలిపారు. ఎల్ఏసీ వద్ద ఎనిమిది నెలలుగా భారత్, చైనా సైనికుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సైనిక, దౌత్య మార్గాల్లో పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ, ఇంతవరకు ఎలాంటి ఫలితం లభించలేదు. ఓవైపు శాంతి చర్చల పేరుతో దృష్టి మరల్చి.. మరోవైపు సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది. సరిహద్దు లో చైనా ఆగడాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.