Begin typing your search above and press return to search.

ఊహాగానాలకు చెక్.. ఎట్టకేలకు బయటకొచ్చిన జిన్ పింగ్

By:  Tupaki Desk   |   28 Sept 2022 2:30 AM
ఊహాగానాలకు చెక్.. ఎట్టకేలకు బయటకొచ్చిన జిన్ పింగ్
X
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గృహ నిర్బంధంలో ఉన్నారంటూ వినిపించిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఉజ్జెకిస్తాన్ వెళ్లి వచ్చిన ఆయన్ను నిర్బంధించారన్న ఊహాగానాలకు తెరపడింది. ఆయన ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరు కావడంతో ఈ రూమర్లకు చెక్ పడింది.

బీజింగ్ లోని ఎగ్జిబిషన్ సందర్శనకు జిన్ పింగ్ హాజరైనట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ తెలిపింది. అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఈ నెల ప్రారంభంలో ఉజ్బెజికిస్తాన్ పర్యటనకు వెళ్లొచ్చాక బయట కనిపించలేదు. ఆయనను గృహ నిర్బంధం చేశారని.. అధ్యక్షుడిగా సైన్యాధిపతి అవబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.అయితే తాజాగా జిన్ పింగ్ బయటకు వచ్చారు.

గత దశాబ్దంలో చైనా సాధించిన విజయాల గురించి మంగళవారం బీజింగ్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌ కు వచ్చి జిన్ పింగ్ సందర్శించి ప్రసంగించినట్టు ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా నివేదించింది.

సెప్టెంబరు 16న అర్ధరాత్రి ఉజ్బెకిస్తాన్‌లోని శిఖరాగ్ర సమావేశం నుండి బీజింగ్‌కు తిరిగి వచ్చిన తర్వాత జిన్ పింగ్ ఇప్పుడే బహిరంగంగా కనిపించారు. ఆ పర్యటనకు ముందు, చైనా నాయకుడు చివరిసారిగా జనవరి 2020లో విదేశాలకు వెళ్లారు, అతను సెంట్రల్ సిటీ అయిన వుహాన్‌ను లాక్ చేయడానికి కొన్ని రోజుల ముందు మయన్మార్‌ను సందర్శించాడు.

జూలైలో 25 సంవత్సరాల చైనా పాలనను జరుపుకోవడానికి హాంకాంగ్‌ లో జిన్ పింగ్ పర్యటించారు. రెండు రోజుల పర్యటన తర్వాత దాదాపు రెండు వారాల పాటు చైనా అధ్యక్షుడు బహిరంగంగా కనిపించలేదు. రెండు సంవత్సరాలకు పైగా చైనాను దాటి జిన్ పింగ్ బయటకు వెళ్లలేదు. ఇటీవలే ఉజ్బెకిస్తాన్ కు వెళ్లివచ్చాడు. ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌లో అనేక మంది ఇతర దేశాల వారిని కలిసినప్పుడు జిన్ పింగ్ మాస్క్ ధరించారు. మాస్క్ లేకుండా జరిగే విందులో పాల్గొనలేదు.జిన్ పింగ్ కఠినమైన కోవిడ్ చర్యలను తన నాయకత్వంలో దేశంలో అమలు చేశాడు. బయట దేశాల్లో కూడా తనకు కరోనా సోకకుండా కఠిన జాగ్రత్తలు తీసుకున్నాడు.

వచ్చే నెలలో జిన్ పింగ్ చైనా అధ్యక్షుడి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటికే రెండు సార్లు జిన్ పింగ్ అధ్యక్షుడయ్యాడు. 3వ సారి కూడా కావాలని నిబంధనలు మార్చాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.