Begin typing your search above and press return to search.

రష్యాలాగే చైనా తెగిస్తుందా? తైవాన్ పై యుద్ధానికి దిగుతుందా?

By:  Tupaki Desk   |   17 Oct 2022 12:30 AM GMT
రష్యాలాగే చైనా తెగిస్తుందా? తైవాన్ పై యుద్ధానికి దిగుతుందా?
X
ప్రపంచంలోనే అగ్రదేశాల్లో ఒకటిగా ఉన్న రష్యా తన పొరుగున ఉన్న ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగి ఇప్పుడు నిలువునా మునిగింది. ప్రపంచాన్ని ముంచుతోంది. ఇప్పుడు రష్యా బాటలోనే చైనా కూడా దిగేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. హాంకాంగ్ స్వేచ్ఛను హరించి దాన్ని చైనాలో కలిపేసుకున్న జిన్ పింగ్ ఇప్పుడు తైవాన్ పై కన్నేశారు. ఆ దేశాన్ని కలుపుకోవాలని చూస్తున్నారు.

అయితే ఉక్రెయిన్ కు ఎలాగైతే అమెరికా సహకారం అందించిందో ఇప్పుడు తైవాన్ కు కూడా అమెరికా అత్యాధునిక విమానాలు, ఆయుధాలు, క్షిపణలు సరఫరా చేస్తూ చైనాకు కాక పుట్టిస్తోంది. చైనా యుద్ధానికి దిగితే ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తోంది.

చైనాకు జీవితకాలపు అధ్యక్షుడు అయ్యేందుకు జిన్ పింగ్ తాజాగా కమ్యూనిస్టు మహాసభలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తైవాన్ ను ఆక్రమించుకునే ప్రయత్నాలను ఆయన ప్రారంభించినట్టు తెలుస్తోంది. 'తైవాన్ సార్వభౌమాధికార దేశమని తనకు తానే భావిస్తోందని.. దాన్ని చైనా మాత్రం విడిపోయిన ప్రావిన్సుగానే చూస్తోందని.. పునరేకీకరణ కోసం శాంతియుతంగా ప్రయత్నిస్తామని.. తైవాన్ ఒప్పుకోకపోతే బలప్రయోగ అస్త్రాన్ని విడిచిపెట్టలేమని.. ' చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హెచ్చరికలు జారీ చేశారు.

దేశ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాల కోసం సైన్యాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. వారంరోజుల కమ్యూనిస్టు మహాసభలు ఆదివారం ప్రారంభమైన సందర్భంగా జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక చైనా ప్రధాని కెకియాంగ్ సహా సీనియర్ నాయకులంతా ఈసారి రాజీనామా చేసి వైదొలుగుతున్నారు.ఒక్క జిన్ పింగ్ మాత్రమే మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. జీవితకాలం ఉండే రాజ్యాంగాన్ని మారుస్తున్నారాయన.. మరి తైవాన్ పై యుద్ధానికి దిగుతాడా? లేదా?అన్నది వేచిచూడాలి.