Begin typing your search above and press return to search.

ఆశ్చ‌ర్యం: మోడీపై చైనా ప్ర‌శంస‌లు

By:  Tupaki Desk   |   24 Jan 2018 7:04 PM IST
ఆశ్చ‌ర్యం: మోడీపై చైనా ప్ర‌శంస‌లు
X
ఆశ్చ‌ర్య‌క‌ర‌మే కాకుండా...చాలా చాలా అరుదైన విషయం. ఎప్పుడూ ఇండియాతో ఉప్పునిప్పులా ఉండే చైనా.. తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోడీని మెచ్చుకుంది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా మోడీ చేసిన ప్రసంగం చైనాను ఆకట్టుకుంది. గ్లోబలైజేషన్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సంబంధించి రెండు దేశాల ఆలోచన ఒకేలా ఉన్నదని చైనా స్పష్టంచేసింది. అచ్చూ త‌మ లాగానే మోడీ ఆలోచిస్తున్నార‌ని కితాబు ఇచ్చింది.

దావోస్‌లో జ‌రుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లను తెలిపారు. అందులో ప్రొటెక్షజం కూడా ఒకటి. చాలా దేశాలు ఎవరి ప్రయోజనాల కోసం అవి పనిచేస్తున్నాయని, గ్లోబలైజేషన్ క్రమంగా తగ్గిపోతున్నదని మోడీ ఆందోళన వ్యక్తంచేశారు. అంతర్జాతీయ సమాజంలో ఉన్న విభేదాలను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. చైనా విదేశాంగ ప్రతినిధి హ్యూ చున్యింగ్ దీనిపై మన ప్ర‌ధానికి కితాబు ఇచ్చారు. `స్వదేశీ వస్తు రక్షణ విధానం (ప్రొటెక్షనిజం)ను మోడీ వ్యతిరేకించడం చూస్తే.. ప్రస్తుతం గ్లోబలైజేషనే ట్రెండ్ అన్నది స్పష్టమవుతుంది. ఇది అన్ని దేశాల ప్రయోజనాలకు మేలు చేస్తుంది` అని అన్నారు. ప్రొటెక్షనిజంకు వ్యతిరేకంగా పోరాటం, గ్లోబలైజేషన్‌ను ప్రమోట్ చేయడంలో రెండు దేశాలూ ఒకేలా వ్యవహరిస్తున్నాయని ఆయన చెప్పారు.

గతేడాది ఇదే దావోస్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రొటెక్షనిజంకు వ్యతిరేకంగా ఇచ్చిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా చైనా విదేశాంగ ప్రతినిధి హ్యూ చున్యింగ్ గుర్తుచేశారు. `అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధికి ఇండియా సహా అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఇండియా మాకు అతి ముఖ్యమైన పొరుగు దేశం. భారత్‌తో మెరుగైన సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాం. ఇది రెండు అభివృద్ధి చెందుతున్న దేశాలకూ మేలు చేస్తుంది` అని చున్యింగ్ స్పష్టంచేశారు. రెండు దేశాల ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.