Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ భారిన పడ్డ హైదరాబాద్ వాసి !

By:  Tupaki Desk   |   25 Jan 2020 12:23 PM IST
కరోనా వైరస్ భారిన పడ్డ హైదరాబాద్ వాసి !
X
కరోనా వైరస్ ..ప్రస్తుత ప్రపంచ దేశాలకి ముచ్చెమటలు పాటిస్తున్న అత్యంత భయంకరమైన వైరస్. చైనాలో మొదలైన కరోనా వైరస్ వేగంగా అన్ని దేశాలకూ వ్యాపిస్తుంది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా 41 మంది మరణించినట్టు చైనా శనివారం ప్రకటించింది. అలాగే మరో 1300 మందికి ఈ వైరస్ సోకినట్టు తెలిపింది. ఇదిలా ఉండగా చైనా, హాంకాంగ్ నుంచి భారత్‌కు వచ్చిన 12 మందికి కరోనా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. దీంతో వీరిని హాస్పిటల్‌ ఉంచి ప్రత్యేక వార్డులో చికిత్స అందజేస్తున్నారు.

ఈ 12 మందిలో తొమ్మిది మంది కేరళలోని ఎర్నాకుళం, త్రిసూర్‌ కు చెందినవారు కాగా, ఇద్దరు ముంబైవాసులుగా గుర్తించారు, మరొకరు హైదరాబాద్ పౌరుడు అని తెలుస్తుంది. శుక్రవారం ముంబైకి చెందిన ఇద్దరి నుండి, హైదరాబాద్, బెంగళూరుకు చెందిన ఒక్కొక్కరి నుంచి రక్త నమూనాల సేకరించి పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి పంపారు. అయితే, ఫలితాలు నెగెటివ్‌ గా వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

ఇకపోతే కొట్టాయంకి చెందిన ఓ మహిళకు తీవ్రమైన జ్వరం రావడంతో ఆమెను ఇంటి వద్దే ఉంచి.. వైద్యుల పర్యవేక్షిస్తున్నారు. కేరళలో 80 మందిని వైద్యుల నిఘాలు ఉంచినట్టు తెలుస్తోంది. అటు నేపాల్‌లోనూ కరోనా వైరస్ కేసు నమోదయ్యింది. చైనాలోని వుహాన్ నగరం నుంచి వచ్చిన ఓ నేపాలీ విద్యార్ధి శ్వాస వ్యవస్థ సమస్య తో హాస్పిటల్ చేరాడు. అయితే, అతడికి చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినా, రక్త నమూనాల్లో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. హాంకాంగ్ ల్యాబొరేటరీ లో రక్త నమూనాలను పరీక్షించ గా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ విద్యార్ధి, అతడి కుటుంబం కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.