Begin typing your search above and press return to search.
డ్రాగన్ రక్షణ బడ్జెట్ ఎంతో తెలుసా ?
By: Tupaki Desk | 6 March 2022 2:00 PM ISTడ్రాగన్ దేశం చైనా రక్షణ బడ్జెట్ ప్రవేశపెట్టింది. గతంలో ఎన్నడూ లేనంత భారీగా బడ్జెట్ ను పెంచేసింది. పోయిన ఏడాది బడ్జెట్ కన్నా తాజా బడ్జెట్ 7.5 శాతం పెంచింది. తాజా రక్షణ బడ్జెట్ ఎంతంటే 230 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రు. 17.5 లక్షల కోట్లు. మన దేశపు రక్షణ బడ్జెట్ కన్నా మూడు రెట్లు ఎక్కువ. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుత యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తగా డ్రాగన్ తన బడ్జెట్ కేటాయింపులను పెంచేసిందనే అనుకోవాలి. ఇఫ్పటికే సరిహద్దు దేశాల్లో చైనా చిచ్చురేపేతున్న విషయం అందరు చూస్తున్నదే.
ఒకవైపు మనదేశపు సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చేస్తోంది. అలాగే నేపాల్ తో గొడవలున్నాయి. ఇవి సరిపోదన్నట్లు భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ లోకి కూడా చొచ్చుకుని వచ్చేస్తోంది. పొరుగుతున్న దేశాల్లో పాకిస్ధాన్ తో తప్ప మిగిలిన అన్నీ దేశాలతోనే కావాలనే తగాదాలు పెట్టుకుంటోంది.
ఇపుడు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నట్లే రేపు సరిహద్దు దేశాలతో ఎవరితో యుద్ధం చేస్తుందో తెలీదు కాబట్టే అవసరానికి అనుగుణంగా తన బడ్జెట్ ను చైనా పెంచేసుకున్నది. నిజానికి చైనాతో యుద్ధానికి దిగేంత సీన్ భూటాన్, అరుణాచల్ ప్రదేశ్, నేపాల్ కు లేవు. అలాగే ఒకవేళ చైనా దురాక్రమణకు దిగినా ప్రతిఘటించేంత సీన్ కూడా పై దేశాలకు లేవు. ఏదైనా సమస్యంటు వస్తే అది మనదేశంతోనే అని చైనాకు బాగా తెలుసు.
వాస్తవం ఆలోచిస్తే మనకన్నా రక్షణరంగ వ్యవస్ధలో చైనాయే బలంగా ఉంది. ఆర్మీ విషయం తీసుకున్నా, వైమానికి బలం తీసుకున్నా చైనానే టాప్ లో ఉంది. కాకపోతే చైనా అంటే పడని చాలా దేశాలు వెంటనే మనదేశానికి మద్దతుగా నిలుస్తాయి.
ఇదే సమయంలో రక్షణ రంగంలో మనదేశం కూడా చైనా అంత కాకపోయినా బలంగానే ఉంది. ఈ విషయం ఈమధ్యనే జమ్మూ-కాశ్మర్లోని గాల్వాన్ లోయలో జరిగిన ముష్టియుద్ధంలో చైనాకు బాగా అర్ధమయ్యుంటుంది. అందుకనే ఎప్పటికప్పుడు రక్షణరంగం బడ్జెట్ ను పెంచుకుంటోంది.