Begin typing your search above and press return to search.

2028 నాటికి ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా

By:  Tupaki Desk   |   27 Dec 2020 2:30 AM GMT
2028 నాటికి ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా
X
ఇప్పుడు ప్రపంచపు పెద్దన్న అమెరికా.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం.. సంపన్న దేశం అమెరికానే. ప్రపంచంలోని అన్ని దేశాలపై గుత్తాధిపత్యం చెలాయించేది అమెరికానే.. అలాంటి అమెరికాను అధిగమించే దిశగా చైనా దూసుకెళుతోంది.

2028 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరించనుంది. నివేదికల ప్రకారం.. కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయ్యింది. అయితే ఈ వైరస్ ను పుట్టించిన చైనా మాత్రం ఇదే అదనుగా అమెరికాను తోసిరాజని బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు స్కెచ్ గీసింది.

సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ప్రకారం.. 2028 నాటికి అమెరికా డాలర్లను మించి చైనా అధిగమిస్తుందని.. తద్వారా చైనా ఆర్థిక వ్యవస్థ విలువ భారీగా పెరిగిపోతోందని అంచనా వేసింది. ఏడాది క్రితం ఊహించిన దానికంటే అర దశాబ్ధం ముందుగానే అమెరికాను చైనా అధిగమిస్తుందని పేర్కొంది.

కోవిడ్19 సంక్షోభం నుంచి చైనా త్వరగా కోలుకుందని.. 2020లో 2శాతం మేర వృద్ధి చెందుతోందని ఈ నివేదిక తెలిపింది. ప్రపంచంలోని అన్ని దేశాలు మైనస్ ఆర్థిక వ్యవస్థల్లో ఉంటే ఒక్క చైనా మాత్రమే ప్లస్ 2 శాతం నమోదు చేయడం విశేషం.

మొత్తం మీద ప్రపంచ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ ఏడాదిలో 4.4 శాతం తగ్గుతుందని నివేదిక అంచనావేసింది. ఇంత కల్లోలంలోనూ పుంజుకున్న చైనా ఒక ఏడాది క్రితం కంటే 5 ఏళ్ల ముందే అమెరికాను అధిగమించగలదని తెలిపింది.