Begin typing your search above and press return to search.

ఇద్దరు పిల్లల్ని కనాలని చెప్పనున్న చైనా

By:  Tupaki Desk   |   21 Dec 2015 2:53 PM IST
ఇద్దరు పిల్లల్ని కనాలని చెప్పనున్న చైనా
X
దశాబ్దాల పాటు కఠినంగా అమలు చేసిన కుటుంబ నియంత్రణ విధానానికి చైనా స్వస్తి పలికే రోజు వచ్చేసింది.ఇప్పటివరకూ ఒక జంట.. ఒక బిడ్డ అన్న నినాదాన్ని పక్కన పడేయనుంది. దేశంలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య.. మానవ వనరులకు ఏర్పడుతున్న కొరతతో పాటు.. ఇప్పుడు అనుసరిస్తున్న విధానాల్నియథాతధంగా అమలు చేస్తే.. దేశానికి భారీ నష్టం తప్పదన్న ఆలోచనతో కుటుంబ నియంత్రణ మీద ఇప్పటివరకూ ఉన్న నిబంధనల్ని పక్కన పారేయాలని చైనా సర్కారు భావిస్తోంది.

దీనికి సంబంధించి ఇప్పటికే చైనా చట్టసభలు నిర్ణయం తీసుకుంది. ఇక.. కొత్త నిర్ణయాన్ని అమలు చేయటమే మిగిలి ఉంది. ఒక జంట..ఇద్దరు పిల్లలు అన్న కొత్త నినాదాన్ని కొత్త సంవత్సరం నుంచి చైనా వినిపించనుంది. మరి.. దశాబ్దాల పాటు పిల్లల్నికనేందుకు తీవ్ర ఆంక్షలు ఎదుర్కొన్న చైనా ప్రజలు.. తాజాగా ప్రభుత్వం పిల్లల్ని కనాలంటే ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల పిల్లల్ని కనే విషయంలో వెసులుబాటు కల్పించినా.. పెద్దగా ప్రయోజనం కలగని నేపథ్యంలో.. చైనా సర్కారు వినిపించాలని భావిస్తున్న కొత్త నినాదం ఎంతవరకు సక్సెస్ అవుతుందోనన్నది ప్రశ్నే.