Begin typing your search above and press return to search.

కిమ్ కోసం చైనా వైద్యబృందం.. సీరియస్ నిజమేనా?

By:  Tupaki Desk   |   25 April 2020 1:40 PM IST
కిమ్ కోసం చైనా వైద్యబృందం.. సీరియస్ నిజమేనా?
X
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టు వార్తలు వచ్చాయి ఇటీవలే ఆయన చేయించుకున్న గుండె సర్జరీ తిరగబెట్టిందని తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ అనుమానిస్తోందట.. దీనికి సీఎన్ఎన్ కథనం కూడా బలాన్ని ఇస్తోంది. దక్షిణ కొరియా వార్త సంస్థలు కూడా దీన్ని ధృవీకరించాయి. కానీ ఇదంతా వట్టి గాలివార్తలని ఉత్తర కొరియా సహా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దక్షిణ కొరియా కూడా తాజాగా కొట్టిపారేసింది.

అయితే ఇవన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సంచలన విషయం ఒకటి చోటుచేసుకుంది. ముగ్గురు సభ్యుల ప్రముఖ వైద్యుల బృందాన్ని చైనా ఉత్తరకొరియాకు పంపడం హాట్ టాపిక్ గా మారింది. కమ్యూనిస్టు పార్టీకి చెందిన లైనిస్ డిపార్ట్ మెంట్ నేతృత్వం లో ముగ్గురు వైద్యులు ఉత్తర కొరియాకు వెళ్లారు. అయితే కిమ్ ఆరోగ్యంపై మాత్రం చైనా ఎలాంటి ప్రకటన చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా నియంత కిమ్ ఆరోగ్యం నిజంగానే విషమించిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చైనా వైద్య బృందాన్ని ఇంతటి కరోనా టైం లోనూ ఉత్తర కొరియాకు పంపడం తీవ్ర చర్చనీయాంశమైంది. నిజం గానే కిమ్ ఆరోగ్యం క్షీణించి ఉంటుందన్న అనుమానాలకు ఈ చర్య బలాన్నిస్తోంది.

ఇక కిమ్ బాగానే ఉన్నాడని అందరూ చెప్తున్నా ఆయన మాత్రం బయటకు ఎందుకు కనిపించడం లేదన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ట్రంప్, ఉత్తరకొరియా వెనకేసుకు వస్తున్నా.. కిమ్ మాత్రం మీడియా ముందుకు రావడం లేదు. దీంతో ఏదో జరిగిందన్న అనుమానాలకు చైనా వైద్య బృందం రాక బలాన్ని చేకూరుస్తోంది.