Begin typing your search above and press return to search.

ప్రపంచాన్ని వణికించే భయం ఎంతో చెప్పేసే ఫోటో ఇది..

By:  Tupaki Desk   |   25 Jan 2020 9:40 AM IST
ప్రపంచాన్ని వణికించే భయం ఎంతో చెప్పేసే ఫోటో ఇది..
X
మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం.. వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణం.. భవనాన్ని నిర్మించటానికి.. అందులో అన్ని వసతుల్ని సెటప్ చేయటానికి ఎన్ని రోజులు పట్టొచ్చు? అన్న ప్రశ్న వేస్తే.. ప్రైవేటు సంస్థా? ప్రభుత్వం నిర్మిస్తుందా? అన్న రివర్స్ ప్రశ్న ఎదురవుతుంది. ప్రైవేటు కన్న మాట వస్తే.. తక్కువలో తక్కువ ఒక ఏడాది సమయం ఖాయమన్న మాట వస్తుంది. కానీ.. కేవలం పదంటే పది రోజులు చాలన్న మాట వింటే అవాక్కు అవ్వాల్సిందే.

కానీ.. ఈ తరహా మాటలు చైనా లాంటి దేశాల్లో చాలా కామన్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విరుచుకుపడుతున్న వేళ.. చిగురుటాకులా వణుకుతున్న చైనా.. ఈ వ్యాధికి గురైన వారికి చికిత్స అందించేందుకు వీలుగా భారీ ఆసుపత్రి నిర్మాణాన్ని షురూ చేసింది. దీని కోసం జరుగుతున్న నిర్మాణ పనులకు ఈ ఫోటో నిలువెత్తు నిదర్శనం. భారీ విస్తీర్ణం లో పెద్ద ఎత్తున ప్రొక్లెయిన్లు పని చేస్తున్న ఇక్కడే.. మరో పది రోజుల్లో ప్రత్యేక ఆసుపత్రి ని నిర్మించనున్నారు.

ప్రీ ఫాబ్రికేటెడ్ విధానం లో పది రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రి ని నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. ఇందు కోసం రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా పనులు సాగుతున్నాయి. కరోనా వైరస్ సోకినోళ్లకు ప్రత్యేకం గా వైద్యసాయం అందించేందుకు ఈ భారీ నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు. ఇలా చేయగలరు కాబట్టే.. అది చైనా అయ్యింది. అదే.. మన దగ్గర ఇలాంటివి కలలో కూడా ఊహించ గలమా? ఇప్పుడర్థమైందా? ఈ ఫోటో వెనుక ప్రపంచాన్ని వణికించే భయం ఎంతుందో?