Begin typing your search above and press return to search.
చైనాలో వన్య ప్రాణుల పాలిట వరం 'కరోనా'!
By: Tupaki Desk | 8 Feb 2020 10:00 AM ISTనాన్ వెజ్ ఐటమ్స్ వండడంలోను....ఆ వండిన ఐటమ్స్ ను పోటీ పడి తినడంలోనూ చైనా - జపాన్ దేశాల వారు ముందుంటారు. దోరగా వేయించిన గబ్బిలం మాంసం మొదలుకొని....బ్రతికున్న ఆక్టోపస్ వరకు కాదేదీ తినడానికనర్హం అంటారు చైనీయులు. అడవి జంతువులు, పక్షులను వండుకు తినడం అక్కద సర్వసాధారణం. అయితే, తమ దేశపు జనాభా..భౌగోళిక పరిస్థితులు - అందుబాటులో ఉన్న ఆహారపు వనరుల దృష్ట్యా వారు ఆ తరహా ఆహారానికి అలవాటుపడ్డామన్నది అక్కడి ప్రజల వాదన. అయితే, ఆ తరహా ఆహారం తినడం వల్లే చైనాలో కరోనా విలయ తాండవం చేస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయి.
మరోవైపు - కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత చైనాలో నాన్ వెజ్ దాదాపుగా మానేశారట. ఇక కరోనా పుణ్యమా అంటూ అనేక అడవి జంతువులు ఊపిరి పీల్చుకుంటున్నాయట. మాంసం తినడం వల్ల కరోనా వ్యాప్తి చెందదని వైద్యులు చెబుతున్నారు. కానీ, చైనీయులు ముందు జాగ్రత్తగా మాంసం తినడం మానేశారట. అసలు కరోనా దెబ్బకు ఇళ్లలోనుంచి బయటకు వచ్చేందుకే చైనా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారట. ఇక, నాన్ వెజ్ - అడవి జంతువులతో చేసిన వంటకాల ఊసెత్తేందుకు కూడా వారు భయపడుతున్నారట.కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లు....ప్రస్తుతం కరోనా కరిష్మాతో చాలా మూగ జీవాలు బ్రతికిపోతున్నాయట. కరోనా దెబ్బకు అడవి జంతువులు - పక్షులను ఎవరూ తినడం లేదట. ఏది ఏమైనా....మానవుల పాలిట ప్రాణాంతకంగా మారిన కరోనా....వన్య ప్రాణుల పాలిట మాత్రం ప్రాణదాత అయిందని చెప్పవచ్చు.