Begin typing your search above and press return to search.

షాంఘై మాల్ ఖాళీ అయ్యింది ఎందుకు?

By:  Tupaki Desk   |   22 Jan 2016 10:41 AM IST
షాంఘై మాల్ ఖాళీ అయ్యింది ఎందుకు?
X
దాదాపు 70 ఎకరాల్లో.. 5 లక్షల చదరపు మీటర్లలో నిర్మించిన ఓ భారీ మాల్ ఎలా ఉండాలి? సందడి సందడిగా హడావుడిగా ఉండాల్సిన సదరు మాల్ ఈగలు కూడా వెళ్లని పరిస్థితి. జనసంచారం అంటూ ఉండని ఈ మాల్ గురించి విన్నప్పడు కాస్త షాకింగ్ గా అనిపించకమానదు. అమెరికా రక్షణకు గుండెకాయ లాంటి పెంటగాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం చూసి.. ముచ్చటపడి అదే తరహాలో షాంఘైల షాపింగ్ మాల్ డిజైన్ చేశారు.

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా.. రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం డిజైన్ మాల్ కు ఎలా సూట్ అవుతుందన్న చిన్న లాజిక్ ను మిస్ కావటంతో వందల కోట్ల రూపాయిలతో నిర్మించిన ఈ భారీ మాల్ కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటున్న పరిస్థితి. అత్యద్భుతమైన ఆర్కిటెక్ట్ తో అదిరిపోయేలా ఉండే ఈ షాపింగ్ మాల్ లోకి అడుగు పెట్టేందుకు ఎవరూ ఇష్టపడని పరిస్థితి. ఎందుకిలా అంటే.. ఈ మాల్ లో నిర్మాణం అంత గజిబిజిగా ఉండటం.. ఒక అర్థంపర్థం లేకుండా.. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలీకుండా పోవటమే కాదు.. అసలు ఎవరు ఎక్కడ ఉన్న విషయం మీద అనుక్షణం సందేహం కలిగేలా ఉన్న మాల్ దెబ్బకు పర్యాటకులే కాదు.. చైనీయులు హడలిపోయారు. దీంతో.. మాల్ ముఖం చూడటం మానేశారు.

కస్టమర్లు రాకపోతే.. షాపులోళ్లు కూడా ఎంతకాలమని ఖాళీగా వెయిట్ చేస్తారు? అందుకే.. వాళ్లు కూడా తమ తమ షాపుల్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అద్భుత కళాఖండంగా తీర్చి దిద్దిన మాల్ ఇప్పుడు ఖాళీగా వెలవెలపోయే పరిస్థితి. మాల్ ని మాల్ మాదిరి కట్టాలే కానీ .. రక్షణ శాఖ కార్యాలయంగా కట్టాలనుకుంటే ఇలాంటి తిప్పలు తప్పవు మరి.