Begin typing your search above and press return to search.

చెంగ్డూలోని యూఎస్ కాన్సులేట్ నే మూయమనటం వెనుక కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   25 July 2020 9:00 AM IST
చెంగ్డూలోని యూఎస్ కాన్సులేట్ నే మూయమనటం వెనుక కారణం ఇదేనా?
X
ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు.. మొండితనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే చైనాకు మధ్య రచ్చ రోజురోజుకి మరింత పెరుగుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఇప్పుడు కొంత పుంతలు తొక్కుతోంది. అమెరికాలోని హ్యూస్టన్ లోని చైనా కాన్సులేట్ కార్యాలయానికి అమెరికా మూసివేయాలని కోరటం.. అందుకు ప్రతీకారం తీర్చుకునే నిర్ణయాన్ని చైనా వెల్లడించింది. అందరి అంచనాలకు భిన్నంగా వూహాన్ లోని అమెరికా కాన్సులేట్ ను మూసేయమని చెబుతారని భావిస్తే.. అందుకు భిన్నంగా చెంగ్డూలోని కార్యాలయాన్ని క్లోజ్ చేయమని చెప్పటం ద్వారా దెబ్బకు దెబ్బ తీసినట్లు అయ్యిందని చెబుతున్నారు.

అమెరికాలో చైనాకు హ్యూస్టన్ కార్యాలయం ఎంత కీలకమో.. అమెరికాకు చైనాలో నిచెంగ్డూ లోని కాన్సులేట్ ఆఫీసు అంతే కీలకం. అదెలానంటే.. ఈ కాన్సులేట్ కార్యాలయాన్ని 1985లో ప్రారంభించారు. ఇందులో 200 మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. వీరిలో 150 మంది స్థానిక చైనీయులే కావటం గమనార్హం.

సమస్యాత్మక టిబెట్ గురించి సమాచారాన్ని సేకరించటంలోచెంగ్డూకార్యాలయం ఇప్పటికే కీలక భూమిక పోషిస్తుంటుంది. పెద్దన్నకు షాకివ్వాలంటే.. తనకు అత్యంత ముఖ్యమైన కాన్సులేట్ కార్యాలయాన్ని మూసివేయాలని కోరితే పెద్దన్నకు ఇబ్బందే. ఎందుకంటే.. చెంగ్డూ కార్యాలయాన్ని మూసివేయటం ద్వారా టిబెట్ కు సంబంధించిన పరిణామాలు తెలుసుకునే అవకాశాన్ని మిస్ అయ్యే పరిస్థితి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో హ్యుస్టన్ లోని చైనా కార్యాలయాన్ని మూసివేయాలని చైనాకు ఇచ్చిన షాకుకు సరిపోయేలా చైనా రియాక్షన్ ఉందని చెబుతున్నారు. హ్యుస్టన్ కార్యాలయంలో 200 మంది సిబ్బంది పని చేస్తుండగా.. డ్రాగన్ దేశంలో క్లోజ్ చేయాలన్న యూఎస్ కాన్సులేట్ లోనూ 200 మందే పని చేస్తుండటం గమనార్హం. మొత్తానికి దెబ్బకు సరైన దెబ్బనే చైనా కొట్టిందనే చెప్పాలి. మరి.. ఈ రీతిలో ఒకరికి మరొకరు ఇచ్చుకుంటున్న షాకులు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాల వరకూ తీసుకెళతాయన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.