Begin typing your search above and press return to search.

కరోనా ల్యాబ్‌లో పుట్టింది కాదంట! నిజమేనా !

By:  Tupaki Desk   |   16 April 2020 12:47 PM GMT
కరోనా ల్యాబ్‌లో పుట్టింది కాదంట! నిజమేనా !
X
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్ధల్లో అల్లకల్లోలం రేపింది. ఈ కరోనా దెబ్బకి అభివృద్ధిలో ఎంతో ముందున్న దేశాలు సైతం అల్లాడిపోతున్నాయి. దీనికి సరైన వ్యాక్సిన్ లేకపోవడం తో దీన్ని అడ్డుకోవడానికి మరో మార్గం లేక యావత్ ప్రపంచమే లాక్ డౌన్ ను విధించింది. అయితే , ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ కరోనా మహమ్మారి చైనాలో ఒక ల్యాబ్ లో తయారు చేసారంటూ అమెరికా చైనా పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

అయితే ,కరోనా మహమ్మారిని చైనాలోని ఓ ల్యాబ్‌లో సృష్టించారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసిందని చైనా విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. వుహాన్‌ ప్రాంతంలోని ఓ లేబొరేటరీలో కరోనా వైరస్‌ను పుట్టించారనే వార్తలను చైనా తోసిపుచ్చింది అంతేకాదు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జో లిజన్‌ వివరణ ఇచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ను ల్యాబ్‌ లో సృష్టించలేదని డబ్ల్యూహెచ్‌ ఓ అధికారులు నిగ్గు తేల్చారు అని తెలిపారు.

కాగా కరోనా వైరస్‌ ను చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో సృష్టించారా అనే అంశాన్ని తమ ప్రభుత్వం నిగ్గుతేల్చేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం చెప్పారు. వైరస్‌ పై తమకు తెలిసిన అంశాలతో చైనా నిజాయితీగా ప్రపంచం ముందుకు రావాలని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కోరారు. అయితే చైనా మాత్రం ఇలాంటి ఆరోపణలకు దూరంగా ఉండాలని అమెరికాను హెచ్చరించింది. అలాగే కరోనా విషయంలో తాము ప్రపంచానికి ఎంతో సహాయం చేస్తున్నామని తేల్చింది.