Begin typing your search above and press return to search.

రెండో అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ ప్రారంభించిన చైనా..

By:  Tupaki Desk   |   29 Jun 2021 6:00 AM IST
రెండో అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ ప్రారంభించిన చైనా..
X
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన నీటి ప్రాజెక్టు 'త్రీ గోర్జెస్'ను నిర్మించిన చైనా.. ఆ త‌ర్వాత‌ మ‌రో అతి పెద్ద జ‌ల విద్యుత్ డ్యామ్ ను నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఇది ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద జ‌ల‌విద్య‌త్ డ్యామ్ దీని పేరు 'ది బైహేతన్'. ఈ డ్యామ్ ను చైనా తాజాగా ప్రారంభించింది.

ఈ ప్రాజెక్టులో మొత్తం 16 యూనిట్లు ఉండ‌గా.. తొలి విడ‌త‌గా.. సోమ‌వారం రెండు యూనిట్ల‌ను ప్రారంభించిన‌ట్టు చైనా ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. యాంగ్జే న‌దికి ఉప‌న‌ది అయిన జిన్ షా న‌దిపై ఈ డ్యామ్ ను నిర్మించారు. దీని ఎత్తు 289 మీట‌ర్లు.

ఈ డ్యామ్ లో మొత‌త్ం 16 యూనిట్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో యూనిట్ కు ఒక మిలియ‌న్ కిలోవాట్ల‌ విద్యుత్ ను ఉత్ప‌త్తి చేసే కెపాసిటీ ఉంది. ఈ డ్యామ్ నిర్మాణం ద్వారా.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆన‌క‌ట్ట‌ల‌ను నిర్మించిన దేశంగా చైనా నిలిచింది. అతిపెద్ద నీటి ప్రాజెక్టు అయిన 'త్రీ గోర్జెస్'ను 2003లోనే నిర్మించింది. ఈ రెండు ప్రాజెక్టుల‌నూ ప్ర‌భుత్వ రంగ సంస్థ త్రీ గోర్జెస్ కార్పొరేష‌న్ నిర్మించిన‌ట్టు తెలిపింది.

ఇంత భారీ ప్రాజెక్టులు నిర్మించ‌డం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు క‌లుగుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. అయితే.. బొగ్గు వినియోగం త‌గ్గించ‌డానికే తాము ఈ ప్రాజెక్టులు క‌డుతున్నామ‌ని చైనా చెబుతోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్ర‌తీ సంవ‌త్స‌రం 20 మిలియ‌న్ల ట‌న్నుల బొగ్గు ఆదా అవుతుంద‌ని చైనా తెలిపింది.