Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ తో వార్.. భారత్ కే సపోర్టు

By:  Tupaki Desk   |   27 Feb 2019 2:15 PM IST
పాకిస్తాన్ తో వార్.. భారత్ కే సపోర్టు
X
ఉగ్రవాదులకు భూతల స్వర్గంగా మారిన పాకిస్తాన్ భారత్ తో వైరం పెట్టుకొని ఇప్పుడు అంతర్జాతీయంగా ఒంటరవుతోంది. భారత్ జవాన్లపై ఉగ్రవాదులు పుల్వామాలో దాడిచేసి 45మందిని పొట్టన పొట్టకున్న సంగతి తెల్సిందే. దీంతో భారత్ రగిలిపోయింది. ఈ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల శిబిరాలపై మంగళవారం ఉదయం 3:30గంటలకు భారత యుద్ధవిమానాలు దాడిచేసి 300మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

అయితే పాకిస్తాన్ దేశంలోకి వెళ్లి మరీ భారత్ మెరుపు దాడిచేసినా పాకిస్తాన్ దేశానికి ఏ ఒక్క దేశం మద్దతు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఉగ్రవాదులను మొదటి నుంచి పెంచిపోశిస్తోంది పాకిస్తాన్ అనే విషయం ప్రపంచానికంతటికి తెలుసు. దీంతో భారత్ ఆ దేశ భూభాగంలోకి వెళ్లి దాడి చేయడంపై ఏ దేశం కూడా ఖండించడం లేదు. పైగా ఉగ్రవాదుల శిబిరాలను టార్గెట్ చేయడంతో అంతర్జాతీయంగా భారత్ కు బాసట లభిస్తోంది. ఇక మొదటి నుంచి పాకిస్తాన్ కు మద్దతు ఉంటున్న చైనా కూడా భారత్ కొంత సంయమనం పాటించాలని కోరిందే తప్పా ఎక్కడా తప్పుపట్టిన దాఖలు లేవు. పాకిస్తాన్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించనూ లేదు. దీంతో చైనా అండ దొరుకుతుందన్న పాకిస్తాన్ కు నిరాశ ఎదురైంది.

ప్రస్తుత పరిస్థితులు పాకిస్థాన్ అంతగా అనుకూలంగా లేవు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న భారత్ కే ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. పాకిస్తాన్ తమ దేశంలోని ఉగ్రవాద శిబిరాలను నామరూపాల్లేకుండా చేయాలని ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు బహిరంగంగా హెచ్చరిస్తున్నాయి. చైనా కు పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచన పడింది. ఇక రష్యా భారత్ కు అత్యంత మిత్ర దేశం. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ భూభాగంలోకి భారత్ బలగాలు వెళ్లినా అంతర్జాతీయంగా భారత్ కే సపోర్టు లభిస్తుండటం విశేషంగా చెప్పొచ్చు. మరీ పాకిస్తాన్ వైఖరి మారుతుందో లేక కయ్యానికి కాలుదువ్వుతుందో చూడాలి మరీ..