Begin typing your search above and press return to search.

చైనా 38 వేల చదరపు కి.మీ. ఆక్రమించుకుంది : రాజ్‌నాథ్ !

By:  Tupaki Desk   |   17 Sept 2020 5:00 PM IST
చైనా 38 వేల చదరపు కి.మీ. ఆక్రమించుకుంది : రాజ్‌నాథ్ !
X
భారత్ , చైనా సరిహద్దు వద్ద గత కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొనివుంది. ఇరు దేశాలు కూడా పోటా పోటీగా సైన్యం మోహరింపులతో ఏం క్షణం ఏం జరుగుతుందోన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గాల్వానా లోయ ఘటన తరువాత ఈ పరిస్థితి మరింత తీవ్ర తరం అయింది. చైనాతో యుద్ధం కాకుండా , సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలని భారత్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ , చైనా తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. ఒకవైపు చర్చలు అంటూనే , మరోవైపు దాడులకు ఎగబడుతుంది. అయితే మన సైన్యం కూడా చైనాకి దీటుగా జవాబు ఇస్తుంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితులపై రాజ్యసభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు.

సరిహద్దు వివాదంపై ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ .. చైనాతో ఎలాంటి పరిస్థితులున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని , మన సాయుధ బలగాలతో చైనాకు ఇప్పటికే గట్టిగా సమాధానమిచ్చామని, ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాలను చైనా బహిరంగంగానే ఉల్లఘింస్తుందని మరోసారి గుర్తుచేశారు. అలాగే , చైనా సైన్యం కదలికలపై నిఘా పెట్టినట్లు ఆయన తెలిపారు. మంగళవారం చైనా సరిహద్దు వివాదంపై రాజ్‌నాథ్‌ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్‌ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లద్దాఖ్‌ వెళ్లి భారత బలగాలకు భరోసా కల్పించారని చెప్పారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్‌నాథ్‌ సింగ్ స్పష్టం చేశారు.

1962లో లద్దాఖ్‌ లో చైనా 38వేల చదరపు కి.మీ మేర ఆక్రమించింది. పాకిస్థాన్‌ నుంచి 5వేల చ.కి.మీ భూమిని తీసుకొంది. అంతేకాదు అరుణాచల్ ‌ప్రదేశ్‌ లోని 90 వేల చ.కి.మీ భూభాగం తమదని చైనా వాదిస్తోంది. 1988 తర్వాత భారత్‌, చైనాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయి. వాటిని చైనా ఉల్లంఘిస్తోంది. చైనా చెప్పేదొకటి. చేసేది మరొకటి. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు నిదర్శనం. ఇది మంచి పద్దతి కాదు. ప్రస్తుతం లద్దాఖ్‌లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్.