Begin typing your search above and press return to search.

మరోసారి బయటపడిన చైనా వక్రబుద్ధి..ఏం చేసిందంటే?

By:  Tupaki Desk   |   10 April 2020 4:30 PM GMT
మరోసారి బయటపడిన చైనా వక్రబుద్ధి..ఏం చేసిందంటే?
X
కరోనా వైరస్ .. ఇప్పుడు ఈ పేరు ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. అలాగే కరోనా పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే మరోపేరు చైనా. అసలు ఇది కరోనా వైరస్ కాదు .. చైనా వైరస్ అంటూ ఈ మధ్య అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చైనా పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. చైనా.. నకిలీకి మారు పేరు అని అందరూ చెప్తుంటారు. అసలు చైనా అంటేనే నకిలీ. నకిలీవి తయారుచేయడంతో చైనా వారితో ఈ ప్రపంచంలో ఎవరు పోటీరారు. ఇకపోతే , ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో పోరాడుతుంది. ఒకరకంగా దీనికి కారణం చైనానే. ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన మొదట్లోనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోని ఉంటే , ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది ఉండేది కాదు.

ఏదేమైనా కూడా ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణికిపోతోంది. అయితే , చైనా మాత్రం ఈ వైరస్ పై ఇప్పటికే విజయం సాధించింది. దీనితో పలు దేశాలకి శానిటైజెర్లు , మాస్కులని ఎగుమతి చేస్తుంది. కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బందికి ఇచ్చేందుకు చైనా నుంచి తెప్పించుకున్న మాస్క్‌లు సురక్షితంగా లేవని ఫిన్లాండ్‌ తెలిపింది. ఆ మాస్కులు నిర్ణీత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తెలిపింది.

చైనాలోని గ్వాంగ్‌ జౌ నుంచి వచ్చిన 2 లక్షల సర్జికల్‌ మాస్కులు, 2.3 లక్షల రెస్పిరేటర్‌ మాస్కులను వాడే ముందు ఒకసారి పరీక్షించాలని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఐనో కైసా తెలిపారు. ఆ మరుసటి రోజే ఫిన్లాండ్‌ అధికారులు ఈ మాస్కులు రక్షణ ప్రమాణాలను అందుకోలేదని ప్రకటించారు. నాసిరకం ఉత్పత్తులను సరఫరా చేస్తోందంటూ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఇటీవల స్పెయిన్ - నెదర్‌ ల్యాండ్స్ - టర్కీ - ఆస్ట్రేలియా దేశాలు కూడా చైనా ఉత్పత్తులను తిరస్కరించాయి. ఇంత జరుగుతున్నా చైనా మాత్రం తప్పు సరిదిద్దుకోవడం లేదు.