Begin typing your search above and press return to search.
చైనా లాంగ్ మార్చ్.. ఢిల్లీని ఢీ కొట్టే ఛాన్స్?
By: Tupaki Desk | 7 May 2021 9:19 AM ISTఅంతరిక్షంలోకి పంపిన చైనా లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ అదుపు తప్పటం.. నియంత్రణ కోల్పోయి భూమి దిశగా వస్తుండటం తెలిసిందే. దీంతో.. ఇదెక్కడ పడుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం.. ఈ రాకెట్ మరో 48 గంటల్లో భూమిని తాకే వీలుందని చెబుతున్నారు. మే 8న భూమిని ఢీ కొడుతుందంటున్నారు. దీంతో.. భూమిలోని ఏ ప్రాంతాన్ని ఈ రాకెట్ ఢీ కొడుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
అమెరికాలోని హార్వర్డ్ స్మితోజియన్ అస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ ఖగోళ శాస్త్రవేత్త జొనాథన్ మెక్ డోవెల్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వేసిన లెక్కల ప్రకారం.. అదుపు తప్పిన లాంగ్ మార్చ్ రాకెట్.. నేరుగా భారత దేశ రాజధాని ఢిల్లీ మహానగరం మీద పడే అవకాశం ఉందంటూ కొత్త బాంబు పేల్చారు. ఇప్పటికే కరోనా కేసులతో కిందా మీదా పడుతున్న ఆ మహానగరానికి.. తాజాగా చైనా రాకెట్ వ్యవహారం చెమటలు పట్టిస్తోంది.
అదే సమయంలో చైనాలోని బీజింగ్ మహానగరం మీదా.. ఆస్ట్రేలియా దేశ రాజధాని కమ్ అతి పెద్ద మహానగరమైన సిడ్నీ మీదా పడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ రాకెట్ సెకనుకు నాలుగు మైళ్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తుందని.. భూమధ్యరేఖకు ఉత్తర.. దక్షిణ భాగాల్లో 41 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతంలో ఎక్కడైనా లాంగ్ మార్చ్ కుప్పకూలొచ్చన్నారు. అయితే.. దాన్ని అదుపులోకి తెచ్చుకొని.. నిర్జన ప్రదేశాల వైపు మళ్లించేందుకు చైనా విపరీతంగా ప్రయత్నిస్తుండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి.. చైనా ఏం చేస్తోంది? లాంగ్ మార్చ్ ఏం చేస్తుందన్న విషయం తేలాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయక తప్పదు.