Begin typing your search above and press return to search.
చైనా నిండా ముసలోల్లే... బెడిసి కొట్టిన జనాభా నియంత్రణ
By: Tupaki Desk | 14 Feb 2021 8:00 PM ISTజనాభా నియంత్రణ చైనా కొంపముంచింది. ఇప్పుడు ఆ దేశంలో వృద్ధులు ఎక్కువయ్యారు. దీంతో ప్రభుత్వం జనాభా నియంత్రణ నిబంధనలను సడలించింది. పిల్లల్ని కనండి బాబూ.. అని మొత్తుకుంటున్నది. చైనాలో జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో 1970 లో వన్ చైల్డ్ ‘ఒక పాప ముద్దు’ పాలసీని తీసుకొచ్చింది. దీంతో అందరూ ఒక్కరినే కనడంతో ఆ దేశంలో వృద్ధులు ఎక్కువైపోయారు. ఇలా అనడం కంటే యువకుల సంఖ్య తగ్గిపోయిందని అని చెప్పవచ్చు.
ఏ దేశానికైనా బాలలే పట్టుకొమ్మలు.. అయితే చైనా విధానంతో పిల్లలు పుట్టడం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఆ దేశంలో వృద్ధులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే 2016లో చైనా నిబంధనలను కొంత మేర సడలించింది. ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతిచ్చింది. అయినప్పటికీ ఆ దేశ ప్రజలు పెద్దగా స్పందించలేదు. దీంతో ఇప్పుడు ఇద్దరు పిల్లలను కనాలంటూ ఆ దేశం మొత్తుకుంటున్నది.
2020లో చైనాలో 10.04 మిలియన్ల జననాలు నమోదయ్యాయి. 2019 సంవత్సరంతో పోలిస్తే జననాల సంఖ్య 30 శాతానికి పడిపోయింది. పిల్లలను కనేవాళ్లకు ప్రత్యేకంగా బహుమతులు కూడా ఇస్తున్నారు. అయితే ఒక్కరిని మాత్రమే కనేందుకు ఆ దేశంలోని చాలా మంది మానసికంగా సిద్ధపడ్డారు. ఇద్దరు పిల్లలను కనడం లేదు. అంతేకాక చైనాలో జీవన వ్యయం కూడా పెరిగిపోయింది. యువకులు లేకపోవడం.. దేశానికి ఎంతో ప్రమాదకరమని ప్రభుత్వం భావిస్తున్నది.