Begin typing your search above and press return to search.

వైర‌స్‌కు జ‌న్మ‌నిచ్చిన దేశ‌మే విరుగుడు క‌నిపెట్ట‌డంలో ముందంజ‌

By:  Tupaki Desk   |   25 July 2020 9:00 PM IST
వైర‌స్‌కు జ‌న్మ‌నిచ్చిన దేశ‌మే విరుగుడు క‌నిపెట్ట‌డంలో ముందంజ‌
X
మ‌హ‌మ్మారి వైరస్‌కు విరుగుడు క‌నిపెట్టే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఎన్నో ప‌రిశోధ‌నా సంస్థ‌లు.. శాస్త్ర‌వేత్త‌లు వ్యాక్సిన్‌పై విస్తృతంగా ప‌రీక్ష‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వైర‌స్‌కు జ‌న్మ‌నిచ్చిన చైనానే ఆ వైర‌స్‌కు విరుగుడు క‌నిపెట్ట‌డంలో ముందున్నామ‌ని ప్ర‌క‌టించింది. ఈ క్రమంలోనే చైనా శాస్త్రవేత్తలు తాజాగా ఓ ప్రకటన చేశారు. వైర‌స్‌కు విరుగుడుగా తాము రూపొందించిన వ్యాక్సిన్‌ అన్ని ప్రయోగాల్లో విజయవంతమైంద‌ని.. విడుదలకు అనుమతి కూడా పొందినట్లు ప్రకటించింది. ఆ మందు పేరే కిన్సినో బయో వ్యాక్సిన్‌ లిమిటెడ్‌కు చెందిన‌ది. ఈ మందుకు చైనా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీంతో పాటు వైర‌స్‌కు క‌నిపెట్టిన మందుల్లో వూహన్‌, సినోవాక్‌ వ్యాక్సిన్లు కూడా మూడు దశల్లోనూ ప్రయోగాలను పూర్తి చేసుకున్నాయని తెలిసింది.

ఇప్ప‌టికే ప్ర‌పంచాన్ని ఆక‌ర్షిస్తున్న మందు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ త‌యారు చేస్తున్న వ్యాక్సిన్. ఈ మందు ఇప్ప‌టికే మూడు ద‌శ‌ల్లో ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే బహిరంగ మార్కెట్‌లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ మందుపై ప్ర‌పంచ‌మంతా ఆశ‌లు పెట్టుకుంది. ఇక ఆస్ట్రేలియాలో కూడా శాస్త్రవేత్తలు మందు క‌నిపెట్టారు. వారు మార్డోక్ అనే వ్యాక్సిన్‌పై ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మందుకు ఆ దేశ వైద్య పరిశోధన మండలి అనుమతి కోసం ఎదురుచేస్తున్నారు.

ఇక మ‌న దేశం భారత్‌లో‌ బయోటెక్ వైర‌స్‌కు విరుగుడు క‌నిపెట్టే ప‌నిలో త‌లామున‌క‌లైంది. ఆ సంస్థ త‌యారుచేస్తున్న కోవాగ్జిన్ ప్ర‌యోగాల ద‌శ‌లో ఉండ‌గా ఆ మందు సత్ఫలిస్తోందని ఐసీఎంఆర్ ప్రకటించింది. అయితే మ‌రికొన్ని ప‌రీక్ష‌లు పూర్తి చేసుకోవాల్సి ఉంది. అందుకే మన దేశంలో క‌న్నా ప్ర‌పంచ దేశాల్లో ఇత‌ర మందులు తొలిగా రానున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆలోపు అమెరికా, చైనా, ఆస్ట్రేలియా దేశాలు మందును విడుద‌ల చేస్తే ఆ మందుల‌పై భార‌త‌దేశం ఆధారపడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఆ దేశాలు మందు రూపొందిస్తే వెంట‌నే భారీ ఎత్తున ఆర్డర్‌ ఇచ్చేందుకు భారత్‌కు చెందిన కంపెనీలు వేచి ఉన్నాయి.