Begin typing your search above and press return to search.

చైనా కన్నింగ్​ బుద్ధికి.. కారణం అదేనా!

By:  Tupaki Desk   |   4 Sept 2020 12:00 PM IST
చైనా కన్నింగ్​ బుద్ధికి.. కారణం అదేనా!
X
దశాబ్దాలపాటు మౌనంగా ఉన్న చైనా ఒక్కసారిగా రెచ్చిపోవడానికి కారణం ఏమిటీ? ఇంతకాలం స్నేహహస్తం చాచకపోయినా.. భారత్​తో పెద్దగా కయ్యానికి దిగలేదు. అందుకు భారత్​లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం కూడా ఓ కారణం. కానీ ఉన్నట్టుండి కరోనా విపత్తువేళ చైనా బరితెగించడానికి కారణం ఏమిటో సామన్య జనాలతోపాటు, రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇందుకు రాజకీయవిశ్లేషకులు చెబుతున్న కారణం ఒక్కటే. చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవతున్నాయి. దేశంలోని మేధావులు, ప్రజలతోపాటు సొంత పార్టీలోని నేతలు సైతం ఆయన వైఖరితో విసిగిపోయారు. ఈ నేపథ్యంలో దేశప్రజలను రెచ్చగొట్టి.. వారిలో దేశభక్తిని నింపితే తాను మళ్లీ హీరోగా మారిపోవచ్చని జిన్​పింగ్​ ఎత్తులు వేశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముందుగా రచ్చ గెలిస్తేనే ఇంట గెలవొచ్చని జిన్​పింగ్​ భావిస్తున్నారట. అంతర్జాతీయ స్థాయిలో ధృడంగా ఉంటే దేశంలోని అంతర్గత పరిస్థితులను తన కంట్రోల్​లో ఉంచుకోవచ్చని జిన్​పింగ్​ ఆలోచిస్తున్నట్టు భావిస్తున్నారు. అందుకే.. అక్కడి దేశభక్తిని రెచ్చగొట్టి.. ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు జిన్‌పింగ్.


అమెరికన్​ ఫస్ట్​ అన్న నినాదాన్ని మందుకు తీసుకెళ్లి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న ట్రంప్​ లాగే జిన్​పింగ్​ కూడా ఆలోచిస్తున్నారట. జాత్యహంకారాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు జిన్ పింగ్. ప్రపంచంలో చైనాను.. గొప్ప దేశంగా మారుస్తున్నట్లు చెప్పుకుంటూ.. పొరుగు దేశాలతో కయ్యానికి దిగుతున్నారు. అమెరికాను ఢీకొన్ని యోధుడిగా ప్రచారం చేసుకుంటున్నారు. 2022లో.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరుగనున్నాయి. అప్పటివరకు దేశప్రజల్తో తన మీద వ్యతిరేకత రాకుండా ఉండేందుకు జాగ్రత పడుతున్నారు. జిన్ పింగ్. మరోవైపు పార్టీ సీనియర్లను మచ్చిక చేసుకుంటూ.. తానే కొనసాగడానికి జిన్ పింగ్ ఎత్తులు వేస్తున్నాడు.

దక్షిణచైనా సముద్ర ప్రాంతంలో చిన్న దేశాలను బెదిరించి దారిలోకి తెచ్చుకోవాలని చైనా యత్నిస్తోంది. హాంకాంగ్ నిరసనలను క్రూరంగా అణచివేస్తోంది. ప్రపంచమంతా ఓ వైపు ఉంటే.. తమ నాయకుడు జిన్​పింగ్​ మరో వైపు ఉన్నట్టు అక్కడి ప్రజలకు జిన్​పింగ్​ కలరింగ్ ఇస్తున్నాడు. కానీ పరిస్థితి కూడా అందుకు అనుకూలంగానే ఉంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇండియా, కజకిస్థాన్‌ లాంటి దేశాలతో విభేదాలు పెరిగిపోతున్నాయ్. 2050 వరకు చైనాను ప్రపంచంలోనే బలమైన శక్తిగా తీర్చిదిద్దుతానని జిన్ పింగ్ తన దేశంలో బీరాలు పలుకుతున్నాడు. జిన్​పింగ్​ కు సొంతపార్టీ నేతలతో ఇప్పడు చిక్కులు ఎదురవుతున్నాయి. కమ్యునిస్ట్​ పార్టీలో సుమారు 200 మంది కేంద్రకమిటీ సభ్యులు ఉంటారు. వారు పార్టీ నాయకుడిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం కేంద్రకమిటీ సభ్యుల్లో మెజార్జీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఉండటంతో ఏంచేయాలో జిన్​పింగ్​కు పాలుపోవడం లేదు.