Begin typing your search above and press return to search.
ఇండియాలో ఏటీఎం కష్టాలు తీరుస్తున్న చైనా
By: Tupaki Desk | 20 Nov 2016 12:20 PM ISTఇండియాలో పెద్ద నోట్ల రద్దు భారీ కుదుపు తేగా.. చైనా వ్యాపారానికి మాత్రం ఇది మంచి సహకారం అందిస్తోందట. ముఖ్యంగా కరెన్సీ కష్టాల్లో పడిన ప్రజలు మొన్నమొన్నటి వరకు ఎత్తుకున్న చైనా వస్తువుల నిషేధ నినాదాన్ని మర్చిపోయారు. అంతేకాదు.... పాత నోట్ల రద్దు తరువాత ప్రవేశపెట్టిన 2 వేల రూపాయల నోటు మన ఏటీఎంలలో పట్టడం లేదన్న సంగతి తెలిసిందే. దానికి సరిపడే క్యాష్ బాక్సులు అర్జంటుగా కావాలి. ఇప్పుడు అవి చైనా నుంచి వస్తున్నాయట. మన ఏటీఎంలకు సరిపడే క్యాష్ బ్యాక్సులను చైనా తయారు చేసి ఇస్తోంది. అంటే జనం కష్టాలు తీరడంలో చైనా పాత్ర కూడా ఉంది.. మనకు కష్టాలు తీరుతున్నాయి.. వారికి వ్యాపారం జరుగుతోంది.
అంతేకాదు.. ప్రతి సందర్భాన్నీ క్యాష్ చేసుకునే చైనా వ్వాపారులు ఇండియన్ కరెన్సీ బ్యాన్ ను కూడా బాగా వాడుకుంటున్నారు. ఇక్కడ ప్రవేశపెట్టిన కొత్త కరెన్సీ చిత్రాలను తమ ఉత్పత్తులపై ముద్రిస్తున్నారు. ముఖ్యంగా డబ్బు పెట్టుకోవడానికి వాడే పర్సులపై మన కొత్త 2 వేల నోటును ముద్రిస్తున్నారు.
పర్సులతో పాటు హ్యాండ్ బాగులపైన - పెన్నులపై... ఒకటేమిటి ఎన్నో వస్తువులపై కొత్త కరెన్సీ కనిపిస్తోంది. చైనా వస్తువులు ఎంత వద్దనుకున్నా మార్కెట్లో మన 2 వేల నోటు బొమ్మతో పర్సు కనిపిస్తే కొనడం మానేస్తారా? అది చైనాదో... ఇండియాదో... కరెన్సీ మాత్రం మనదే. అందుకే చైనా మార్కెట్ ను అంతగా కమ్మేస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/