Begin typing your search above and press return to search.

అదృష్టం అంటే ఇతడిదే..సంక్షోభంలో లక్షల కోట్ల సంపద!

By:  Tupaki Desk   |   25 Sept 2020 10:00 AM IST
అదృష్టం అంటే ఇతడిదే..సంక్షోభంలో లక్షల కోట్ల సంపద!
X
కరోనా వచ్చాక చాలా రంగాలు సంక్షోభంలో కూరుకు పోయాయి. కొన్ని దివాళా తీయగా చాలా కంపెనీలు సిబ్బందిని తగ్గించుకుని అలా నెట్టుకొస్తున్నాయి. కొన్ని సంస్థలు నో వర్క్.. నో పే విధానాన్ని అవలంబిస్తున్నాయి. అలా అన్ని రంగాలు ఇబ్బందుల్లో ఉండగా ఈ సమయంలోనూ కొన్ని రంగాలు దూసుకెళుతున్నాయి. అవి అన్ని మెడికల్ పరమైనవే. కరోనా భయంతో చాలా మంది విటమిన్ ట్యాబ్ లెట్లు వాడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు వంటివి విపరీతంగా వాడుతున్నారు. ఈ రకం సంస్థలు ప్రస్తుతం బాగా వృద్ధి చెందాయి. ఫార్మా రంగాలు బాగా అభివృద్ధి సాధించాయి. తాజాగా చైనాకు చెందిన ఫార్మా కంపెనీలు నడుపుతున్న వ్యాపారవేత్త జాంగ్​ షాన్​షన్ 4.3 లక్షల కోట్ల నికర సంపాదనతో ఆ దేశంలోనే అపర కుబేరుడిగా అవతరించాడు.


కరోనా ఎఫెక్ట్​ తో అన్ని దేశాల్లో ఆర్థిక పరిస్థితులు మారి పోతున్నాయి. కొన్ని వ్యాపారాలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తుండగా.. మరికొన్ని వ్యాపారాలు మాత్రం లాభాలు గడిస్తున్నాయి. అయితే ప్రపంచ దేశాలన్నీ కకావికలమైన వేళ.. చైనా ఆర్థికం గా ఏ మాత్రం దెబ్బతినలేదు. అయితే తాజాగా ఆ దేశంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనాలో ఇప్పటి వరకు అత్యంత ధనికుడిగా పేరు గడించిన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్​ మాను తన ర్యాంక్ ​ను కోల్పోయాడు. ఆ దేశానికి చెందిన మరో వ్యాపార వేత్త జాంగ్​ షాన్​షన్ 4.3 లక్షల కోట్ల నికర సంపాదనతో నంబర్​ వన్​ స్థానాన్ని దక్కించుకుని అత్యంత సంపన్నుడిగా స్థానం పొందాడు. జాంగ్​ షాన్​సన్​కు వాటర్​బాటిల్స్​, బెవరేజేస్​, ఫార్మాకంపెనీలు ఉన్నాయి. తాజాగా బుధవారం అతడి కంపెనీ షేర్లు దూసుకు పోయాయి. దీంతో చైనా లో నెంబర్​ వన్​ వ్యాపార వేత్తగా ఎదిగాడు. ముఖేశ్​ అంబానీ తర్వాత ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డులకు ఎక్కాడు.