Begin typing your search above and press return to search.

చైనాలో మృతులు 42,000 మంది.. డ్రాగన్ అబద్దాలు చెబుతోందా?

By:  Tupaki Desk   |   30 March 2020 11:30 PM GMT
చైనాలో మృతులు 42,000 మంది.. డ్రాగన్ అబద్దాలు చెబుతోందా?
X
కరోనా మహమ్మారి ప్రభావం చైనాపై భారీగానే ఉందా? పెద్ద సంఖ్యలో చనిపోతే అక్కడి ప్రభుత్వం దాచే ప్రయత్నాలు చేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. అధికారిక రికార్డ్స్ ప్రకారం కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో 3,304 మంది మాత్రమే చనిపోయారు. అమెరికాలో 2,597, ఇటలీలో 10,779, స్పెయిన్‌లో 7,340, ఇరాన్‌లో 2,757, ఫ్రాన్స్‌లో 2,606, యూకేలో 1,415 మంది మృత్యువాత పడ్డారు. చైనాలోని వూహాన్‌లో ఈ మహమ్మారి పుట్టింది. ఇక్కడ 2500 మంది మాత్రమే చనిపోయినట్లు చైనా అధికారిక లెక్కలు చెబుతోంది.

కానీ చైనా లెక్కలు తప్పని వూహాన్‌వాసులే చెబుతున్నట్లుగా అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. రికార్డ్స్ ప్రకారం వూహాన్ నగరంలో 2,500 మంది చనిపోయారు. కానీ ఈ నివేదిక కంటే చాలా ఎక్కువ మంది మృతి చెందారని స్థానికులు చెబుతున్నారు. కేవలం ఇక్కడే 42,000 మందికి పైగా మృతి చెంది ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సంఖ్య గురించి సరైన దర్యాఫ్తు లేదని, లెక్కకు మించి జనం వారి వారి ఇళ్లలోనే మరణించారని కూడా చెబుతున్నారు.

వూహాన్‌లో కరోనా ప్రభావం తగ్గిందని, వ్యాపారాలు తిరిగి ప్రారంభమైన వారం రోజులకు ఏడు ఫ్యునెరల్ హోమ్స్‌లో 500 దహన సంస్కారాల చొప్పున జరిగాయని చెబుతున్నారు. ప్రభుత్వం చెబుతోన్న అధికారిక లెక్కలు సరికాదని, ఎందుకంటే ఫ్యునెరల్ హోమ్స్ ఇరవై నాలుగు గంటలూ పని చేశాయని ఓ వ్యక్తి తెలిపినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. వూహాన్‌లో ప్రస్తుతం ఏడు అంత్యక్రియల హోమ్స్ నిరంతరం పని చేస్తున్నాయని, దాదాపు ఒకరోజుకు 5,000 ఫ్యునెరల్ యాషెస్ ఇచ్చి ఉంటారని, మృతులు అంతకుమించి ఉంటారని అంటున్నారు.

రోజుకు 3,500 వరకు యాషెస్ అందచేసే వేజ్ ఇస్తున్నారని చెబుతున్నారట. ఇలా 12 రోజుల్లో 42,000 వరకు ఇచ్చి ఉంటారని, అంటే మృతుల సంఖ్య అంతకుమించి ఉంటుందని అంటున్నారు. కేవలం వూహాన్‌లోనే 40,000 మందికి పైగా కచ్చితంగా చనిపోయి ఉంటారని తామంతా భావిస్తున్నామని హుబెయి ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి చెప్పారు. అధికారులు మృతుల గణాంకాలను ఉద్దేశ్యపూర్వకంగా లేదా అనుకోకుండా తప్పుగా విడుదల చేస్తున్నారని అంటున్నారు. చాలామంది చికిత్స తీసుకోకుండానే చనిపోయిన వారు ఉన్నారని చెబుతున్నారు. ఒక నెలలోనే 28,000 అంత్యక్రియలు చూశామని, రెండున్నర నెలల్లో ఇది ఎంతో ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.