Begin typing your search above and press return to search.
సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్న చైనా.. ఏం జరుగుతోంది?
By: Tupaki Desk | 14 Dec 2021 9:00 AM ISTచీటికి మాటికి సరిహద్దు ఉన్న దేశాలతో గిల్లీ కజ్జాలు పెట్టుకుంటున్న చైనా దేశం భారత్ తోనూ కయ్యానికి కాలుదువ్వింది. ఇరువైపులా సైనికులు దాడుల్లో ప్రాణనష్టం సంభవించింది. అప్పటి నుంచి బార్డర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంటూనే ఉంటోంది.
ఈ క్రమంలోనే చైనా మరో దుస్సహాసానికి ఒడిగొడుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చైనా సరిహద్దుల్లో గ్రామాలను, అక్కడి ప్రజలను ఖాళీ చేయిస్తూ వేరే ప్రాంతాలకు చైనా తరలించడం చర్చనీయాంవమైంది.
ఓవైపు శాంతి మంత్రం జపిస్తూ చైనా మరోసారి భారత సరిహద్దుల వద్దకు కొన్నేళ్ల నుంచి సైనికులను తరలిస్తూ అక్కడ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటూ కొత్తగా గ్రామాలను సైతం చైనా నిర్మిస్తోంది. మరోవైపు ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.
ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కనీస వసతులు లేవు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు ఉత్తరాఖండ్ లో పిథోరాగడ్ జిల్లాలోని చైనా-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న 59 గ్రామాలను ఖాళీ చేశారు. జల్ జీవన్ మిషన్ ఈ మేరకు ఓ నివేదికను సిద్దం చేసింది.పిథోరాగఢ్ జిల్లాలో ప్రస్తుతం 1542 గ్రామాల్లోనే ప్రజలు ఉన్నారని స్పష్టం చేసింది. ఇదే జిల్లాలో మూడేళ్ల క్రితం అక్కడి గ్రామాల సంఖ్య 1601గా ఉండేదని సమాచారం. కొన్ని గ్రామాల్లో పూర్తిగా మనుషులే కనిపించడం లేదు. 59 గ్రామాలు పూర్తిగా ఖాళీ అయ్యాయని చెప్పారు.
ఇక మైగ్రేషన్ కమిషన్ డేటా ప్రకారం.. పిథోరాగఢ్ జిల్లాల్లోనూ 41 గ్రామాల్లో 50శాతానికి పైగా ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మరోవైపు సరిహద్దుల్లో చైనా గ్రామాలను నిర్మిస్తూ తమ ప్రజలను తరలిస్తోంది.