Begin typing your search above and press return to search.
కృత్రిమ సూర్యుడిని సృష్టించిన చైనా! భారత్, అమెరికాలకు ప్రమాదమే
By: Tupaki Desk | 9 Dec 2020 9:41 AM ISTమరో కంత్రీ ప్లాన్ తెర పైకి తెచ్చారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించే చైనా సైంటిస్టులు తాజాగా మరో సూర్యుడిని తయారుచేశారు. శాస్త్రవేత్తలు న్యూక్లియర్ ల్యాబ్‌లో సూర్యుడిని తయారుచేసినట్టు చైనా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ల్యాబ్ లో తయారు చేసిన సూర్యుడు సాధారణ సూర్యగోళం లాగే వేడిని, శక్తిని విడుదల చేస్తుందట. కొత్తగా తయారుచేసిన సూర్యుడిని హెచ్ఎం2 టోకామర్ రియాక్టర్ అనిపిలుస్తున్నారు. సాధారణంగా సూర్యుడి పరమాణు కేంద్రంలోని అణువులు విచ్చిన్నమైనప్పుడు శక్తి విడుదలౌతుంది. చైనా తయారు చేసిన సూర్యుడి లో ఇదే రకమైన రసాయనిక చర్య జరుగుతోంది.
కృత్రిమ సూర్యుడి ద్వారా విడుదలయ్యే శక్తితో చైనా అణు విద్యుత్ ను తయారు చేయనున్నట్టు సమాచారం. చైనా కొత్తగా తయారుచేసిన రియాక్టర్ ద్వారా సుమారు 15 కోట్ల డిగ్రీల సెల్సియస్ శక్తి విడుదలవుతుందట. చైనా అణుబాంబుల తయారీకి కూడా ఈ రియాక్టర్ ను వాడుకోవచ్చని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దీంతో చైనా అణుబాంబుల తయారీ మొదలుపెడితే ప్రపంచదేశాలన్నీ గడగడ లాడాల్సిందే.
ఇప్పటికే ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా ఎదగాలనుకుంటున్న చైనా ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంజర్జాతీయ మీడియాలో చైనా వైఖరిని తప్పుపడుతూ పలు వార్త కథనాలు వెలువడ్డాయి.ఈ విషయంలపై ఇంతవరకు చైనా మీడియా, ప్రభుత్వం స్పందించలేదు.