Begin typing your search above and press return to search.
ఇండియన్ మార్కెట్ లో చైనా 'దమ్ము'
By: Tupaki Desk | 7 Sept 2015 11:51 AM ISTచైనా.. చౌకకు పర్యాయ పదం ఈ పేరు! ఇప్పటి వరకూ ఎలక్ట్రానిక్, యంత్రపరికరాలు వంటి వస్తువులతో భారత్ మార్కెట్ ను ముంచెత్తుతూ వస్తున్న చైనా తాజాగా మరో విభాగంపై దృష్టి పెట్టింది. చౌక సిగరెట్ల తో మన మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటివరకూ సిగరెట్ల మార్కెట్ లో దేశీయంగా ఐటీసీ, గాడ్ ఫ్రే ఫిలిప్స్ కంపెనీలదే ఆధిపత్యం. అయితే ఇటీవల దీనికి గండిపడే సూచనలు కనిపిస్తున్నాయి. వీటికంటే తక్కువ ధరలకు లభిస్తున్న చైనీస్ బ్రాండ్ల సిగరెట్లు దుకాణాలను ఆక్రమిస్తున్నాయి.
బైషా, మార్బొరో, లువిన్, గోల్డెన్ ఎలిఫెంట్, విన్ వంటి చైనీస్ బ్రాండ్లు నెమ్మదిగా అమ్మకాలు పెంచుకుం టున్నాయి. బీడీల మాదిరిగా వీటి విక్రయాలు వేగంగా పుంజుకుంటున్నట్లు పెద్ద నగరాల్లోని దుకాణదారులు పేర్కొంటున్నారు. చైనా బ్రాండ్లకు చెందిన 10 సిగరెట్లు గల ఒక ప్యాకెట్‌ను అమ్మితే రూ. 10 లాభం వస్తుందని ఒక విక్రేత వెల్లడించారు. ఇదే దేశీ బ్రాండ్ అయితే కేవ లం రూ. 4 మిగులుతుందని చెప్పారు. పైగా వీటి ధరలు దేశీ బ్రాండ్లతో పోలిస్తే మూడో వంతు మాత్రమేనని తెలియజేసారు. విడిగా ఒక్కో సిగరెట్ ఖరీదు రూ. 3 మాత్రమే కావడంతో మొత్తం ప్యాకెట్టును ఒకేసారి కొన డానికి ధూమపాన ప్రియులు మక్కువ చూపుతున్నట్లు వివరించారు.
2015 మార్చితో ముగిసిన ఏడాది కాలంలో దేశీయంగా మొత్తం 102 బిలియన్ సిగరెట్లు విక్రయమయ్యాయి. ఇక అక్రమ సిగరెట్ల అమ్మకాలు 20 శాతం ఉంటాయని అంచనా. గత రెం డేళ్లలో సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం 40 శాతం పెరగడంతో అక్రమ సిగరెట్ల అమ్మకాలు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. దేశీ బ్రాండ్ ప్యాకెట్ రూ. 100 పలు కుతుంటే, రూ. 30కే వస్తున్న ప్యాకెట్ ను కొనేందుకే అత్యధికులు ఆసక్తి చూపుతున్నట్లు దుకాణదారులు పేర్కొంటున్నారు. అందులోనూ కమిషన్ అధికంగా లభిస్తుండటం కూడా చైనా సిగరెట్లకు ఆదరణ పెంచుతోంది.