Begin typing your search above and press return to search.

చైనా ప్ర‌క‌ట‌న‌...బుద్ధి మార‌లేదు

By:  Tupaki Desk   |   26 Feb 2019 1:43 PM GMT
చైనా ప్ర‌క‌ట‌న‌...బుద్ధి మార‌లేదు
X
ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించిన భార‌త వైమానిక ద‌ళాలు చేప‌ట్టిన దాడి ప‌ట్ల డ్రాగ‌న్ దేశం స్పందించింది. పుల్వామా ఉగ్ర దాడి త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ మిరేజ్ యుద్ధ విమానాల‌తో భార‌త్ దాడి చేసిన ఘ‌ట‌న‌పై త‌న బుద్ధిపోనిచ్చుకోని రీతిలో పాక్ స్పందించింది. భార‌త్‌ - పాకిస్థాన్ దేశాలు సంయ‌మ‌నం పాటించాల‌ని చైనా కోరింది.ఉగ్ర‌వాదంపై పోరును అంత‌ర్జాతీయ స‌హ‌కారంతో చేప‌ట్టాల‌ని ఇండియాను చైనా కోరింది.

ఈ రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకు భారత్ మిరేజ్ యుద్ద విమానాలు ఒక్కసారిగా ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డాయి. బాంబుల వర్షం కురిపించాయి. 12 యుద్ధ విమానాల ద్వారా దాదాపు వెయ్యి కేజీల బాంబులను భారత్ ప్రయోగించింది. కార్గిల్ యుద్దం తర్వాత భారత్.. వైమానిక దాడులకు దిగడం ఇదే మొదటిసారి అనే సంగ‌తి తెలిసిందే. కాగా, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు కాంగ్ స్పందిస్తూ భార‌త్ నిర్వ‌హించిన వైమానిక దాడులపై ఆరా తీస్తున్నామ‌న్నారు. ద‌క్షిణాసియాలో భార‌త్‌ - పాక్ కీల‌క‌మైన దేశాలు అని - మంచి స్నేహం - స‌హ‌కారం ఉంటేనే రెండు దేశాలు అభివృద్ధి చెందుతాయ‌ని, దానితోనే ఈ ప్రాంతంలో స్థిర‌త్వం వ‌స్తుంద‌న్నారు. వాస్త‌వానికి ఇటీవ‌ల యూఎన్‌ లో పుల్వామా దాడిని ఖండిస్తూ చేసిన ప్ర‌క‌ట‌న‌లో చైనా కూడా సంత‌కం చేసింది. కానీ జైషే సంస్థ పేరును ప్ర‌స్తావించేందుకు వ్య‌తిరేకించిన‌ట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా, పాక్ ఉగ్రవాదులపై భారత వైమానిక దళం దాడి చేసిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. దేశమంతా ఇవాళ పండుగ చేసుకుంటోందన్నారు. దేశమంతా అప్రమత్తంగా ఉందన్న మోడీ విజయం మనదే అన్నారు. దేశ ప్రజలు సురక్షితుల చేతుల్లో ఉందని తెలిపారు. మెరుపు దాడుల వీరులకు తలవంచి నమస్కారం చేద్దాం అన్నారు. దేశానికి సేవ చేయాలనుకునే వారికి నా వందనం అన్నారు. అమర వీరుల త్యాగాలకు గుర్తుగా జీతీయ స్మారక స్థూపం నిర్మించామని..సైనికుల కోసం వన్ ర్యాంక్ పెన్షన్ పాలసీ తెచ్చామన్నారు. దేశ రక్షణ కోసం వేలాది మంది సైనికులు కష్టపడుతున్నారన్నారు.