Begin typing your search above and press return to search.
ఇదేనా..తెలంగాణ అతిథ్యం..చైనా బృందం సీరియస్
By: Tupaki Desk | 23 March 2018 10:55 AM ISTతమకంటే తోపులు లేరన్నట్లుగా గొప్పలు చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రచారమే తప్పించి.. అసలు విషయం లేదన్న నిజాన్ని ఒక విదేశీ బృందం తమ అనుభవాన్ని ఉదాహరణగా చూపించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
తెలంగాణ కొత్త రాష్ట్రమని.. అపార అవకాశాలు ఉన్నాయని.. సులభతర వ్యాపార నిర్వహణలో నెంబర్ వన్ అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వ మాటలకు.. చేతలకు మధ్యనున్న వ్యత్యాసం ఏమిటన్నది తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం స్పష్టం చేసింది. పెట్టుబడులు పెట్టటానికి సిద్ధంగా ఉన్నామంటూ వచ్చిన చైనా వ్యాపార బృందాన్ని చిన్నబుచ్చేలా చేసిన వైనం ఇప్పుడు కలకలం రేపుతోంది. తెలంగాణ సర్కారు ప్రచారం చూసి.. తెలంగాణలో పరిస్థితులపై ఎక్కువ ఊహించుకున్నామని.. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్నా.. ప్రభుత్వ తీరు చూశాక మాత్రం తీవ్ర అసంతృప్తికి గురైనట్లు చైనా పారిశ్రామికవేత్తల బృందం స్పష్టం చేసింది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా నుంచి పారిశ్రామికవేత్తలు.. పెట్టుబడిదారులు.. ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం మూడు రోజులు పర్యటించేందుకు హైదరాబాద్ కు వచ్చారు. అయితే.. ఇక్కడి ప్రభుత్వ స్పందన తమకు అసంతృప్తికి గురి చేసినట్లు వారు పేర్కొన్నారు. తమను ఉద్దేశ పూర్వకంగా అవమానించినట్లుగా ఆ బృందం చెబుతోంది. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారు.. తమ పర్యటనను మధ్యలోనే ఆపేసుకొని తిరిగి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు.
భారత్-చైనా ఆర్థిక సాంస్కృతి మండలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో చైనా పారిశ్రామికవేత్తలతో వ్యాపార సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ.. ఐటీ.. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ రావాల్సి ఉంది. రాత్రి ఏడు గంటలకు కార్యక్రమం స్టార్ట్ కావాల్సి ఉన్నా.. 8 గంటల వరకూ వెయిట్ చేయాల్సి వచ్చింది. అయినా రాకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు లేకుండానే సమావేశాన్ని పూర్తి చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన చైనా బృందంలో పర్యావరణం.. సహజ విద్యుత్తు.. మౌలిక సదుపాయాలు.. మౌలిక వసతులు.. గృహ నిర్మాణం.. ఐటీ సేవలు.. పరిశ్రమలకు చెందిన 82 మంది పారిశ్రామికవేత్తలు.. పెట్టుబడిదారులు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చైనా బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతమంది చైనా బృందం ఒక రాష్ట్రానికి ఇదే తొలిసారని.. వేరే ఏ దేశానికి వెళ్లినా తమకు ఘన స్వాగతం లభించేదన్నారు.
పెట్టుబడులు పెట్టటానికి సిద్ధంగా ఉన్నామని..ఇక్కడి ప్రభుత్వ విధానాలు.. రూల్స్ గురించి చర్చించేందుకు తాము వస్తే అస్సలు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన చైనా స్టాల్స్ ఎగ్జిబిషన్ కు రాష్ట్ర మంత్రి కేటీఆర్.. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ డుమ్మా కొడితే.. సాయంత్రం కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అలీ.. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ రెండోసారి రాకపోవటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసేలా వ్యవహరించిన తీరుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రీతిలో రియాక్ట్ అవుతారో చూడాలి.