Begin typing your search above and press return to search.
షాకింగ్.. కరోనా మరణాలపై చైనా సంచలన ప్రకటన!
By: Tupaki Desk | 15 Jan 2023 8:00 PM ISTకోవిడ్ పుట్టినిల్లు చైనాలో కరోనా మరోసారి మరణ మృదంగం మోగిస్తున్న సంగతి తెలిసిందే. నిత్యం వేల సంఖ్యలో ప్రజలు కోవిడ్ బారినపడుతున్నారు. మరోవైపు జీరో కోవిడ్ కేసులే లక్ష్యంగా చైనా చేపట్టిన లాక్ డౌన్ ప్రజల ఆగ్రహానికి గురికావడంతో చైనా లాక్ డౌన్ ను ఎత్తేసింది. విమానాశ్రయాల్లో, పోర్టుల్లో సైతం ప్రజల రాకపోకలకు ఎలాంటి నిషేధం లేదు.
దీంతో కోవిడ్ కేసులు అమాంతం పెరిగిపోయాయి. 2019 చివరలో మొదటిసారి కోవిడ్ కేసులు వెలుగుచూసినప్పటి నుంచి చైనా కరోనా మృతులపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈసారి మాత్రం కరోనా మరణాలను చైనా ప్రపంచానికి వెల్లడించింది. 2022 డిసెంబరు 8 నుంచి 2023 జనవరి 12 వరకు 60 వేల కోవిడ్ మరణాలు నమోదయ్యాయని చైనా ప్రకటించింది, మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు.
మృతుల సగటు వయసు 80 ఏళ్లుగా ఉందని చైనా తెలిపింది. మరణించినవారిలో 90 శాతం మంది 65 ఏళ్లకు పైబడినవారేనని చైనా ప్రభుత్వం ప్రకటించింది.
మరణించిన 60 వేల మందిలో 5,503 మంది శ్వాసకోశ వ్యవస్థ విఫలమై మరణించారని చైనా తెలిపింది. మరో 54,435 మంది కోవిడ్ అనారోగ్య కారణాలతో మృతి చెందినట్టు ప్రకటించింది. అయితే కేవలం శ్వాసకోస వ్యవస్థ విఫలమై మృతిచెందినవారిని మాత్రమే అధికారికంగా కోవిడ్ మృతులని చైనా చెబుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి చైనా జీరో కోవిడ్ విధానం, లాక్ డౌన్ ఎత్తేశాక రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా వేల సంఖ్యలో ఉంటున్నాయని వార్తలు వచ్చాయి. ఇటీవల స్మశానాల బయట కోవిడ్ మృతుల అంత్యక్రియల సందర్భంగా భారీ ఎత్తున క్యూలు కట్టారు. రోజులు తరబడి అంత్యక్రియల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
అదేవిధంగా జీరో కోవిడ్ ఆంక్షలను సడలించాక చైనా కోవిడ్ కేసులను లెక్కించడం మానేసిందని సమాచారం. పొరుగు దేశాలతో చైనా సరిహద్దులను తెరిచింది. ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియాల్లో కోవిడ్ వ్యాప్తే లక్ష్యంగా చైనీయుల ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తేసిందనే ఆరోపణలు వ్యక్తమవుతుండటం గమనార్హం.
కాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంభవిస్తున్న మరణాలనే చైనా వెల్లడిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇళ్ల వద్ద మృతి చెందినవారిని లెక్కల్లోకి తీసుకోవడం లేదని చెబుతున్నారు. ఇళ్లల్లో మృతి చెందినవారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే చైనాలో కోవిడ్ మృతులు రోజూ వేల సంఖ్యలోనే ఉంటాయని చెబుతున్నారు.